సినిమా నటులకు సంబంధించి ఏ అంశమైనా ఆసక్తి రేకెత్తిస్తుంది. అదే స్టార్ హీరోల విషయమైతే మరింత సంచలనం రేకెత్తిస్తుంది. ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన పనికి ఎన్టీఆర్ పేరు నెట్టింట్లో వైరల్ అయింది. అది కూడా నెగటివ్ గా. తెలుగులో పవన్ కల్యాణ్ తో ‘బంగారం’ సినిమాలో నటించిన మీరా చోప్రా ఓ లైవ్ ఇంటరాక్షన్ లో చెప్పిన సమాధానం పెద్ద చర్చకు దారి తీసింది. ఏకంగా జాతీయస్థాయిలో టీవీ చానెల్స్ లో ఈ వార్త ప్రసారమైపోయింది. ఫలితంగా ఎన్టీఆర్ తోపాటు ఆయన ఫ్యాన్స్ కూడా విమర్శలపాలయ్యారు.

IHG

 

ఓ లైవ్ ఇంటరాక్షన్ లో తన ఫేవరేట్ హీరో మహేశ్ బాబు అని చెప్పింది మీరాచోప్రా. ఎన్టీఆర్ పై మీ అభిప్రాయం అని అడిగిన నెటిజన్ కు ‘నాకు ఎన్టీఆర్ ఎవరో తెలీదు’ అని చెప్పింది. ఈ సమాధానమే ఆమె విపరీతంగా ట్రోల్ కావడానికి కారణమైంది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆమెపై అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. మరికొందరు బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఈ అంశం వివాదాస్పదం అయిపోయింది. ఏకంగా ఆమె సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడం.. మంత్రి కేటీఆర్ కు విన్నవించడం.. న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడం కూడా జరిగిపోయింది.

IHG' a life-changing experience: <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=MEERA' target='_blank' title='meera-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>meera</a> Chopra - Samaj Weekly

 

లోకల్ చానెల్స్ తోపాటు జాతీయ చానెల్స్ కు కూడా ఆమె ఎన్టీఆర్ అభిమానుల తీరును తూర్పారబట్టింది. ‘ఇటువంటి ఫ్యాన్స్ తో మీరు ఏం సాధిస్తారు.. ఇటువంటి అనాగరిక ఆలోచనల తప్పని చెప్పండి’ అంటూ మెసేజ్ చేసింది. ఈ అంశం నాలుగైదు రోజులు కొనసాగింది. వ్యక్తిగత అభిప్రాయాలను కొంతమంది సీరియస్ గా తీసుకుని వారి వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించడం తగని పని. సోషల్ మీడియా పెరిగిన తర్వాత వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కువ కావడమే ఇటువంటి పరిస్థితులకు కారణం.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: