'అల్లరి' సినిమాతో టాలీవుడ్ కి పరిచయమయ్యాడు ప్రముఖ దర్శకులు ఈవీవీ సత్యనారాయణ చిన్న కొడుకు. మొదటి సినిమా అల్లరి తో ఇంటి పేరే మారిపోయిందని చెప్పాలి. ఆ సినిమా తర్వాత నుండి వరసగా టాలీవుడ్ లో కామెడీ ప్రధానంగా సినిమాలు వచ్చాయంటే అవి ఈ అల్లరోడి సినిమాలే. సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ తర్వాత మళ్ళీ టాలీవుడ్ లో ఆ రేంజ్ ఇమేజ్ ని సాధించాడు. కామెడీ టైమింగ్ లో గాని ఫర్పార్‌మెన్స్ లో గాని ఆ రాజేంద్రుడిలా రెచ్చిపోయాడు. చాలా తక్కువ కాలంలోనే 50 సినిమాల మైల్ స్టోన్ ని దాటేశాడు. సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ఫ్రెస్ లా చక చకా సినిమాలు చేసిన అల్లరి నరేష్ ఒక్కసారిగా ఆగిపోయాడు. 

 

IHG's first look from the film Naandhi | <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=TELUGU' target='_blank' title='telugu-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>telugu</a> ...

చేసిన సినిమాలన్ని బాక్సాఫీస్ దగ్గర చతికిల పడుతున్నాయి. దాంతో కొంత గ్యాప్ తీసుకున్న నరేష్ యూ టర్న్ తీసుకొని కొత్త దారిలో నడుస్తున్నాడు. ఇప్పటి వరకు చేసిన కామెడీ సినిమాలకంటే పూర్తి భిన్నంగా ఉండే కథలను ఎంచుకుంటున్నాడు. కథ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్దంగా ఉన్నాడు. ఇప్పటికే నాంది అనే సినిమాతో పెద్ద ప్రయోగమే చేస్తున్నాడు. ఈ సినిమాలో కొన్ని సీన్స్ లో నగ్నంగా నటిస్తున్నాడు కూడా. క్రైం బ్యాగ్డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే మంచి అంచనాలను పెంచింది. 

 

IHG' to release this <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=DIWALI' target='_blank' title='diwali-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>diwali</a> -

ఇక తాజాగా బంగారు బుల్లోడు అంటూ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాని A టీవీ సమర్పణలో ఏ.కే.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నాడు. విజయ్ దేవరకొండ నటించిన ద్వారక సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన పూజా ఘవేరీ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఒక వైపు హీరోగా నటిస్తున్న అల్లరి నరేష్ గమ్యం, శంభో శివ శంభో, మహర్షి వంటి సినిమాలలో ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నాడు.   

మరింత సమాచారం తెలుసుకోండి: