పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమా తో రి ఎంట్రీ ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే. 2018 వ సంవత్సరం లో 'అజ్ఞాతవాసి' సినిమా తర్వాత దాదాపు రెండు సంవత్సరాల రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ మళ్లీ సినిమాల్లో అడుగుపెట్టడంతో ఈ సినిమాపై పవన్ అభిమానులు అంచనాలు ఓ రేంజ్ లో పెట్టుకోవడం జరిగింది. అయితే ఈ సినిమా అయిన వెంటనే పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో సినిమా చేస్తారని అందరూ భావించారు. దానికి సంబంధించిన ఓ షెడ్యూల్ కూడా పూర్తయినట్లు ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్ బ్యాలెన్స్ కొద్దిగానే ఉన్నట్లు ఇది అయినా వెంటనే స్టార్ట్ చేయనున్నట్లు వార్తలు మొన్నటి వరకు వచ్చాయి.

IHG

కాగా క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకి నిర్మాతగా ఉన్న ఏఎమ్‌ రత్నం ప్రస్తుతం ఆర్థిక సమస్యల లో ఉన్న నేపథ్యంలో క్రిష్ సినిమా ఆలస్యంగా స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కోసం స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి చేసుకుని రెడీగా ఉన్న హరీష్ శంకర్...క్రిష్ కంటే ముందుగా తన ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

IHG's film with <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=PAWAN KALYAN' target='_blank' title='pawan kalyan -గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>pawan kalyan </a>will be a <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=MASS' target='_blank' title='mass-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>mass</a> entertainer ...

ఇప్పటికే షూటింగులకు అనుమతులు రావటంతో త్వరలోనే 'వకీల్ సాబ్' సినిమా షూటింగ్ కంప్లీట్ చేసిన వెంటనే హరీష్ సినిమా తెరపైకి తెచ్చి  అతి తక్కువ టైమ్ లోనే  పవన్ కళ్యాణ్ పూర్తి చేయాలని డిసైడ్ అయినట్లు  ఫిలింనగర్ లో తాజాగా వార్తలు  వైరల్ అవుతున్నాయి.  ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.  గతంలో హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్  సినిమా తీసి బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో... రాబోతున్న ఈ సినిమాపై  భారీ అంచనాలు పెట్టుకున్నారు  పవన్ కళ్యాణ్ అభిమానులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: