రామ్ గోపాల్ వర్మ... లాక్ డౌన్ సమయంలో డేరింగ్ డైరెక్టర్ ఎవరు అంటే ముందు వినపడే పేరు అదే. అవును ఆయన సినిమాలను చేస్తున్న విధానం వాటిని విడుదల చేస్తున్న విధానం చూస్తే ఆయన కచ్చితంగా ధైర్యం ఉన్న దర్శకుడు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ఒక సినిమాను విడుదల చేయడానికి ఒకటికి పది సార్లు ఆలోచన చేస్తున్నారు ఇతర దర్శక నిర్మాతలు. ఆయన మాత్రం ఏ విధంగా కూడా భయపడటం లేదు అనే చెప్పాలి. సినిమాలను విడుదల చేయడానికి గానూ ఆయన ముందుకు వస్తున్నారు. 

 

సినిమా అయినా సరే తాను విడుదల చేయడానికి రెడీ అన్నట్టు... ఆయన సినిమాలను షూట్ చేయడం వాటిని విడుదల చేయడం అనేది ఇప్పుడు జరుగుతూ వెళ్తుంది. ఎవరు ఎన్ని విధాలుగా కామెంట్స్ చేసినా ఆయన మాత్రం సినిమాల విడుదల విషయంలో ఏ మాత్రం కూడా భయపడటం లేదు అనే చెప్పాలి. ఒక సినిమాను విడుదల చేయడానికి గానూ ఆయన పెద్దగా సమయం తీసుకోవడం లేదు. కరోనా అనే సినిమాను మొదలు పెట్టారు. క్లైమాక్స్ అంటూ పోర్న్ స్టార్ తో ఒక సినిమా చేసారు. ఇక మరిన్ని సినిమాలను ఆయన ప్లాన్ చేస్తున్నారు. 

 

తాజాగా మర్డర్ అనే సినిమాను ప్రకటించారు. ఇక పవర్ స్టార్ అనే సినిమాను కూడా ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలా దాదాపు అన్నీ కూడా యన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఆయన మాత్రం ప్లాన్ చేసుకుని విడుదల చేస్తున్నారు. ఎక్కడా కూడా భయపడటం లేదు అనే చెప్పాలి. ఇక వచ్చే నెలలో ఆయన మొత్తం మూడు సినిమాలను విడుదల చేయడానికి గానూ ప్లాన్ చేసినట్టు టాక్ మరి. ఎన్ని సినిమాలను విడుదల చేస్తారు అనేది చూడాలి. ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమా వచ్చే నెల 10 లోపు విడుదల అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: