ఇప్పుడు టాలీవుడ్ లో నిర్మాతలు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నారు. అగ్ర హీరోల సినిమాలు అనగానే ఒకటికి పది సార్లు ఆలోచన చేసే పరిస్థితి అయితే దాదాపుగా ఉంది అనే చెప్పాలి. చిన్న చిన్న సినిమాలు అయితే స్వేచాగా చేయవచ్చు గాని స్టార్ హీరోల సినిమాలు అనగానే ఒకటికి పది సార్లు ఆలోచన చెయ్యాల్సి ఉంటుంది అనే చెప్పాలి. ఇప్పుడు మన తెలుగు లో ఉన్న పరిస్థితుల్లో అయితే దాదాపుగా అగ్ర నిర్మాతలు అందరూ కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నారు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. అందులో ప్రధానంగా చెప్పుకునే నిర్మాతలు అల్లు అరవింద్ సహా మరికొందరు. 

 

అయితే... ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న దానయ్య మాత్రం ఏ విధంగా కూడా భయపడటం లేదు అని అంటున్నారు  టాలీవుడ్ జనాలు. ఆయనలో అసలు ఏ మాత్రం కూడా భయం లేదు అని చెప్తున్నారు. సినిమాకు భారీగా బడ్జెట్ ని ఆయన పెడుతున్నా సరే ఆ సినిమా ఎప్పుడు విడుదల చేస్తాను అనే ఆలోచన ఆయనలో లేదు అని ఇంకా లేట్ అయితే మార్కెట్ పెరుగుతుంది అని ఆలోచన చేస్తున్నారు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఆయన ఇప్పుడు రాజమౌళి ని బాగా నమ్మారు అని టాలీవుడ్ లో టాక్. అందుకే పెట్టుబడి విషయంలో వెనక్కు తగ్గడం లేదట. ఏ విధంగా అయినా సరే సినిమాను విడుదల చెయ్యాలి అనే ఒత్తిడి ఆయన నుంచి లేదని సమాచారం. 

 

అగ్ర హీరోల సినిమాలు చేసే వారు అందరూ భయపడుతున్న సమయంలో ఆయన ఈ విధంగా నిర్మాతగా... దర్శకుడికి అన్ని విధాలుగా భరోసా ఇచ్చారు అని అంటున్నారు. మరి అది ఎంత వరకు నిజం అనేది తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఆయన ఇప్పుడు ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా  కూడా భారీ బడ్జెట్ అని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: