రామ్ గోపాల్ వర్మ సినిమా విడుదల అవుతుంది అంటే మాత్రం అసలు సినిమా హిట్ అవుతుంది అనే ఆశ ఎవరికి ఉండదు. ఆయన హాల్ లో విడుదల చేసినా ఓటీటీ లో విడుదల చేసినా సరే సినిమా ఎంతో దారుణం గా ఉంటుంది అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉంటారు. అవును ఆయన సినిమాలు చూసిన ఎవరు అయినా సరే ఆ సినిమా ఎందుకు చూసాం అనే ఆలోచనలోనే దాదాపుగా ఉంటారు. గత పదేళ్ళు గా ఆయన సినిమా ఒక్కటి అంటే ఒక్కటి కూడా హిట్ కాలేదు అనే చెప్పాలి. అయినా సరే ఆయన మాత్రం సినిమాలను విడుదల చేస్తూనే ఉంటారు. 

 

ఆయన సినిమాలు చేస్తూ జనాలను అన్ని విధాలుగా కూడా వేదనకు గురి చేస్తున్నారు అని కొందరు కామెంట్స్ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. అయినా సరే ఆయన మాత్రం సినిమాల విషయంలో వెనక్కు తగ్గే ఛాన్స్ ఉండదు. ఇక ఇప్పుడు ఆయన విడుదల చేసిన సినిమాలో భారీ డిజాస్టర్ సినిమా ఒకటి ఉంది. మియా మాల్కొవా తో చేసిన ఒక సినిమానే. ఆ సినిమానే క్లైమాక్స్. ఫ్రీ గా చూడటం కూడా అనవసరం అని నెట్ బ్యాలెన్స్ దండగ అని చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా చేసారు అంటే ఆ సినిమా ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. 

 

ఆ సినిమాలో కథ లేదు అని ఏదో ఆమె తో సినిమా చెయ్యాలి అనే విధంగా చేసారు అని అంటున్నారు. ఆ సినిమా చూసిన ఎవరికి అయినా సరే అదే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది అని అంటున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే ఆ సినిమాను ఎవరూ చూసే అవకాశం లేదు అని రామ్ గోపాల్ వర్మకు నష్టాలే తెస్తుంది అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: