ఇప్పుడు టాలీవుడ్ లో సీనియర్ హీరోల భవిష్యత్తు ఏంటీ అనే దాని మీద ఎక్కువగానే చర్చ అయితే జరుగుతుంది అనే చెప్పాలి. అవును సీనియర్ హీరోల విషయంలో మాత్రం కాస్త ఇబ్బంది వాతావరణం ఉంది అనే వార్తలు ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చదువుతున్నాం. దానికి కారణం కరోనా సమయంలో అసలు వారికి మార్కెట్ ఉంటుందా లేదా అనేది చెప్పడం కాస్త కష్టంగా ఉండటమే. ఇక అందులో ప్రధానంగా చిరంజీవి బాలకృష్ణ పరిస్థితి కాస్త భయంకరంగా ఉంది అని అంటున్నారు. వారు సినిమాల విషయంలో ఇప్పుడు చాలా వరకు ఆలోచనలో పడ్డారు అని సమాచారం. 

 

ఇక ఇప్పుడు బాలయ్య మాత్రం చాలా దూకుడుగా ఉన్నారు అని సమాచారం. ఆయన అసలు ఏ విధంగా కూడా భయపడటం లేదు అని టాక్. అవును బోయపాటి శ్రీను తో చేసే సినిమాను షూట్ లేట్ అయినా సరే ఆయన ఏ ఇబ్బంది పడటం లేదు అని కరోనా సమయంలో షూటింగ్ వద్దు అనే విషయం ఆయన స్పష్టంగా చెప్పారు అని సమాచారం. ఇప్పుడు అనవసరంగా షూటింగ్ చేసి ఇబ్బంది పడవద్దు అని ఆయన దర్శక నిర్మాతలకు చెప్పేశారు అని టాలీవుడ్ లో టాక్ వినపడుతుంది మరి. 

 

అది ఎంత వరకు నిజం ఏంటీ అనేది ఎవరికి తెలియదు గాని ఇటీవల ఆయన మాట్లాడిన కొన్ని మాటలు వింటే దాదాపుగా అదే విషయం అర్ధమవుతుంది అనే చెప్పాలి. ఆయన షూటింగ్ కి ఎందుకు అంత తొందర అన్నట్టు మాట్లాడారు మరి. అంటే ఆయనకు షూటింగ్ విషయంలో అంత ఆసక్తి లేదు అని లేట్ అయినా సరే ఎం కాదు అని భావిస్తున్నారు అని అంటున్నారు. బోయపాటి తో చేసే సినిమాను ఆయన వచ్చే ఏడాది విడుదల చేస్తారు అని టాక్ మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: