టాలీవుడ్ లో అగ్ర హీరోలకు సినిమా ఆఫర్లు రావాలి అంటే మాత్రం కచ్చితంగా ఎదురు చూడాల్సిన రోజులు ఇవి. అవును హీరోలు ఆఫర్లు ఇచ్చే రోజులు దాదాపుగా లేవు అని అంటున్నారు. కాని ఇప్పుడు నిర్మాతలు మాత్రం కొందరు హీరోల వెంట పడుతున్నారు. అందులో ప్రత్యేకంగా చెప్పుకునే హీరో అల్లు అర్జున్ అనే చెప్పాలి. అవును అతని కోసం బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి అనే ప్రచారం జరుగుతుంది. అతని సినిమా ఒకటి బాలీవుడ్ లో చేయడం తో పాటుగా అతని తో సినిమా చేయడానికి గానూ మలయాళం నుంచి ఒకరు ఎదురు చూస్తున్నారు. 

 

ఆయనకు ఆ భాషలో మంచి ఫాలోయింగ్ ఉంది అనే సంగతి తెలిసిందే. అక్కడ ఆయనతో సినిమా చేయడానికి గానూ వారు ముందుకు వస్తున్నట్టు తెలుస్తుంది. ఇక తమిళం లో కూడా సూర్య తో సినిమా చేయడానికి గానూ అతను ఎదురు చూస్తున్నాడు అని అంటున్నారు. సూర్య నే ఆఫర్ ఇచ్చాడు అని పుష్ప సినిమాలో సూర్య ని తీసుకునే ఆలోచనలో ఉన్నాడు అనే టాక్ కూడా వినపడుతుంది. నిజం ఎంత అనేది స్పష్టంగా చెప్పలేని పరిస్థితి గాని ఇప్పుడు మాత్రం అతని సినిమాల కోసం ఎదురు చూస్తున్నారట ఇతర భాషల స్టార్ లు. 

 

ఇక బన్నీ కూడా చాలా వరకు జాగ్రత్తగానే సినిమాలను ఓకే చేస్తున్నాడు. ఇక నిర్మాణ రంగం లో కూడా అతను ఇప్పుడు దూకుడుగా వెళ్ళే ఆలోచనలో ఉన్నాడు అనే టాక్ కూడా బాగానే వినపడుతుంది. నిర్మాణ రంగంలో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు అని టాలీవుడ్ లో జనాలు అంటున్నారు. చూడాలి మరి ఎన్ని సినిమాలను నిర్మాతగా చేస్తాడు అనేది. ఇప్పుడు బన్నీ పుష్ప సినిమాలో చేస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఈ సినిమా రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: