టాలీవుడ్ లో ఏది అయినా సరే చిన్న వార్త వచ్చినా సరే జనాలకు ఒక రేంజ్ లో ఆసక్తి అనేది ఉంటుంది. చిన్న వార్తను అయినా సరే ఎంతో ఆసక్తికరంగా చదువుతున్నారు. ఇప్పుడు సినిమాల విషయంలో దాదాపు అదే పరిస్థితి ఉంది అని చెప్పాలి. అవును స్టార్ హీరోల సినిమాల విషయంలో గాని ఏది అయినా పెళ్లి అనే వార్త వచ్చినా గాని జనాలు అందరూ కూడా అదే రేంజ్ లో వాటి గురించి ప్రత్యేకంగా చదువుతున్నారు అనే చెప్పాలి. చిన్న ప్రచారం జరుగుతున్నా సరే దానికి మీడియాలో కూడా మంచి ప్రాధాన్యత ఉంటుంది. 

 

ఇక ఈ లాక్ డౌన్ టైం లో జనాలు అందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తుంది మాత్రం రానా పెళ్లి. అవును రానా పెళ్లి కోసం జనాలు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు అనే చెప్పాలి. రానా పెళ్లి వార్త వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా జనాలు అందరూ చిన్న వార్త ఆ పెళ్లి గురించి వచ్చినా సరే  ప్రత్యేకంగా చదువుతున్నారు అనే చెప్పాలి. ఆ పెళ్లి ఆగస్ట్ లో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆగస్ట్ లో తేదీ కూడా ప్రకటించారు. హైదరాబాద్ లోనే జరుగుతుంది. పెళ్లి ఎక్కడ జరుగుతుంది అనే దాని మీద చాలా వరకు  వార్తలు వచ్చాయి గాని... 

 

అది నిజం కాదు అని హైదరాబాద్ లోనే  వివాహం అనే క్లారిటీ జనాలకు వచ్చింది. ఇక ఈ పెళ్ళికి సంబంధించి ఆహ్వానాలను కూడా దగ్గుబాటి కుటుంబం ఇస్తుంది అని అంటున్నారు. రానా వచ్చే ఏడాది ఇక సినిమాలతో పూర్తిగా బిజీ అవుతున్నాడు. ఈ సినిమాలు ఎక్కువగా తమిళంలో ఉండే అవకాశం ఉంది. మన తెలుగు లో ఇప్పుడు రెండు సినిమాలు చేస్తున్నాడు రానా. ఇవి లాక్ డౌన్ లో ఆగిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: