అల వైకుంఠపురములో సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న అల్లు అర్జున్, తన నెక్స్ట్ చిత్రాన్ని రంగస్థలం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరు బ్లాక్ బస్టర్స్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న సినిమాపై అభిమానుల్లో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. బన్నీ కెరీర్లో మొదటి పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి పుష్ప అనే టైటిల్ ని పెట్టారు.

 

ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా చిత్తూరు ప్రాంత బ్యాక్ డ్రాప్ లో ఉండనుంది. అందుకే ఈ సినిమా కోసం బన్నీ చిత్తూరు ప్రాంత యాసని నేర్చుకుంటున్నాడు. లారి డ్రైవర్ గా కనిపించనున్న బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. పుష్పరాజ్ గా కనిపించనున్న బన్నీ పాత్రకి జోడీగా పల్లెటూరి అమ్మాయిగా రష్మిక పాత్ర రంగస్థలంలో సమంత పాత్రని పోలి ఉంటుందని చెబుతున్నారు. 

 

కరోనా కారణంగా ఇంకా షూటింగ్ మొదలెట్టని ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. రంగస్థలం మాదిరిగానే ఈ సినిమాలోనూ అన్నీ మాస్ సాంగ్స్ ఉండనున్నాయట. అయితే సుకుమార్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ కి ఎంతో ప్రాముఖ్యం ఉంటుందని అందరికీ తెలిసిందే. రంగస్థలం సినిమాలోనూ పూజా హెగ్డేతో జిగేలు రాణిగా రామ్ చరణ్ తో స్టెప్పులు వేయించాడు.

 

ఇప్పుడు పుష్ప సినిమాలో స్పెషల్ ఐటెం నంబర్ ఉందట. ఈ పాటలో బన్నీతో స్టెప్పులు వేయడానికి ఆర్ ఎక్స్ బ్యూటీ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ని సంప్రదించారని టాక్. మరి పాయల్ అందుకు అంగీకరిస్తుందా లేదా చూడాలి. ఒకవేల ఒప్పుకుంటే మాత్రం మంచి అవకాశం అందుకున్నట్లే. ఎందుకంటే పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న సినిమాలో ఐటెం సాంగ్ అంటే ఎంత ప్రత్యేకత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: