బాలీవుడ్‌ బ్యూటీ రిచా చద్దా నెటిజెన్లకు సారి చెప్పింది. గత ఏడాది సోషల్ మీడియా వేదికగా తాను వేసిన జోక్‌ విషయంలో ఇప్పుడు క్షమాపణ కోరింది బ్యూటీ. మెంటల్‌ హెల్త్ అంటే ఏంటో ఇప్పుడిప్పుడే అర్థం అవుతుందన్న రిచా అందుకే క్షమాపణ చెప్పినట్టుగా తెలిపింది.

 

`నా గుర్తున్నంత వరకు గత ఏడాది బైపోలార్‌ వ్యాదితో ఇబ్బంది పడుతున్న ఓ వ్యక్తి గురించి జోక్ వేశాను. కేవలం 280 అక్షరాలతో చమత్కారంగా కనిపించేలా ఓ జోక్‌ను డిజైన్ చేశారు. కానీ నేను ఇప్పుడే మెంటల్‌ హెల్త్‌ అంటే ఏంటో తెలుసుకుంటున్నా. అందుకే నేను క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. కాస్త ఆలస్యంగానే క్షమాపణ కోరుతున్నా` అంటూ సోమవారం ట్వీట్ చేసింది రిచా.

 

రిచా ట్వీట్‌పై నెటిజెన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆమె పోస్ట్‌పై అభిమానులు స్పందిస్తున్నారు. `తప్పును అంగీకరించాలంటే చాలా ధైర్యం కావాలి. మీకు మరింత ధైర్యంగా రావాలి` `తప్పు లేదు. మనం మనుషులం అయినా మీరు చాలా గొప్ప పరి చేశారు. చెడు వ్యతిరేకంగా మీ గళం వినిపించారు` `ఏవరైతే ఆ పరిస్థితిని అనుభవిస్తున్నారో వారికే ఆ బాధ తెలుస్తుంది. వారు మరొకరికి తమ పరిస్థితి చెప్పినా అర్ధం చేసుకోవటం కష్టం.` అంటూ నెటిజెన్లు కామెంట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: