లాక్ డౌన్ ఫలితంగా కుదేలైపోయిన వ్యవస్థల్లో సినీ పరిశ్రమ ఒకటి. షూటింగ్స్ నిలిచిపోవడం.. ధియేటర్లు మూతబడటం.. ఇలా పరిశ్రమ మొత్తం స్థంభించిపోయింది. వ్యవస్థలన్నీ నిలిచిపోయి కార్మికులు ఉపాధి కోల్పోయారు. రోజువారీ ఆదాయం లేక సినీ పరిశ్రమ మీదే ఆధారపడిన కార్మికులెందరో ఉన్నారు. వీరందరికీ చిరంజీవి ఆధ్వర్యంలో సీసీసీ ఏర్పాటు చేసి ఇండస్ట్రీ నుంచి వచ్చిన విరాళాలతో నిత్యావసరాలు రెండు విడతలుగా అందించారు. అయితే.. ఇప్పటికే రెండు దాటడంతో షూటింగ్స్ పర్మిషన్ కోసం చిరంజీవి ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల సీఎంలను కలిశారు. అయితే.. రెండు రాష్ట్రాల సీఎంలను కలిసినందుకు విమర్శలు వచ్చాయి.

IHG

 

ముఖ్యంగా చిరంజీవి ఆధ్వర్యంలో ఏపీ సీఎం జగన్ ను కలిసినందుకు రెండు రకాల విమర్శలు వచ్చాయి. విశాఖలో షూటింగ్స్ నెపంతో అక్కడ భూములు ఇస్తే స్టూడియో నిర్మాణం కోసమేనా అంటూ విమర్శలు వచ్చాయి. మరొకటి.. సీఎంను కలిసేందుకు వెళ్లే దారిలో అమరావతి కోసం భూములిచ్చిన రైతులు నిరసన వ్యక్తం చేశారు. చిరంజీవి, సినీ పెద్దలు వస్తూండటంతో వారి మద్దతు కోసం ప్లకార్డులు పట్టుకుని నిరీక్షించారు. అయితే చిరంజీవి, ఇతరులు ప్రయాణిస్తున్న వాహనాలు అక్కడ ఆగకుండా వెళ్లిపోయాయి. దీంతో విమర్శలు వచ్చాయి. ఇది సినిమా షూటింగ్స్ కోసం పర్మిషన్ అడిగేందుకు వచ్చారు.. కానీ రాజధాని గురంచి కాదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.

IHG

 

చిరంజీవి గతంలో జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానులకు మద్దతు ఇవ్వడంతో వీరి భేటి ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో సినిమా, రాజకీయాలు ఒకదానికొకటి ముడిపడిపోయాయా అనే సందేహాలు కూడా వచ్చాయి. హైదరాబాద్ లో చిరంజీవి ఇంట్లో జరగిన సమావేశంపై కూడా మరో నటుడు బాలకృష్ణ ‘భూములు పంచుకుంటున్నారా..’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయడం.. అవి ఎంత కలకలం రేపాయో తెలిసిందే. మొత్తానికి చిరంజీవి చుట్టూ జరిగిన రాజకీయం సంచలనం రేపింది.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: