ప్రభాస్ సినిమా వస్తుంది అంటే చాలు ఆయన ఫాన్స్ కి ఒక రేంజ్ లో పండగ లాంటి వాతావరణం ఉంటుంది. సినిమా కోసం ఫాన్స్ ఎదురు చూస్తూ ఉంటారు. అతని సినిమాలు ఇప్పుడు రెండేళ్లకు ఒకటి రావడం కూడా కష్టంగా మారింది. సినిమాల విషయంలో ప్రభాస్ లో ఆసక్తి తగ్గింది అనేది కొందరి మాట. మరి కొందరు అయితే ప్రభాస్ బలవంతంగా సినిమాలు చేస్తున్నాడు అని అంటున్నారు. ఇక దర్శక నిర్మాతలు కూడా ఇప్పుడు అతని తో సినిమాలు చేయడానికి  మాత్రం ముందుకు రావడం లేదు అని అంటున్నారు. 

 

ఇక ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే ప్రభాస్ తో సినిమా చెయ్యాలి అనుకునే దర్శక నిర్మాతలు వెనక్కు తగ్గారు అనే ప్రచారం జరుగుతుంది. అవును సోషల్ మీడియాలో ఇప్పుడు దీనిపై పెద్ద చర్చలే నడుస్తున్నాయి. అతని సినిమాలు అనగానే గతంలో ఎంతో ఆసక్తి చూపించే జనాలు ఇప్పుడు అవసరం లేదని భావిస్తున్నారట. రోజు రోజుకి కూడా అతను లేట్ చేయడం సినిమాను విడుదల చేయడానికి ఏళ్ళకు ఏళ్ళు సమయం తీసుకోవడంతో వచ్చే వసూళ్లు వడ్డీలకు సరిపోతాయి అని నిర్మాతలు భయపడుతున్నారట. 

 

అతని తో సినిమా చెయ్యాలి అంటే కచ్చితంగా ప్రభాస్ ఆలోచన మారాలి అని లేకపోతే మాత్రం కష్టమే అని చెప్తున్నారు అని అంటున్నారు. ఇప్పుడు దీనిపై సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతుంది. అతను మారకపోతే మాత్రం తాము సినిమాలు చేయలేము అని నిర్మాతలు చెప్పేయడం తో ప్రభాస్ కూడా ఆలోచనలో పడ్డాడు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి మరి. నిజమా కాదా అనేది తెలియాలి. ఇప్పుడు అతను చేస్తున్న సినిమా 50 శాతం వరకు షూటింగ్ అయిపోయింది. వచ్చే ఏడాది ఈ సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని టాలీవుడ్  వర్గాలు అంటున్నాయి... చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: