ఒక సినిమాకు కధనే ప్రాణం.. ఆ కధకు కొందరి జీవితాలే ఇన్స్పిరేషన్.. అలా అళ్లుకున్న కధలో అసలు హీరో కూడా వారి జీవితాలే.. ఇలా సమాజంలోని కొన్ని సంఘటనలు, కొందరి జీవితాల నేపధ్యంలో వచ్చిన సినిమాలు చాలానే సక్సెస్ సాధించాయి.. ఆ పాత్రలో నటించిన నటులకు ఎనలేని గుర్తింపును తెచ్చిపెట్టాయి.. ఇలాంటి వాటిలో చెప్పుకోదగ్గ చిత్రం సింగం.. ఇందులో పోలీసు పాత్రలో నటించిన సూర్య కెరీర్‌లో ఈ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన అన్ని సినిమాలు ఘన విజయాలు అందుకున్నాయి.. ఇక విక్రం, సామి చిత్రం కూడా అంతే. అయితే ఈ సిరీస్ సినిమాలో పోలీస్ నిజాయితే బలమున్న కధగా సాగుతుంది.. అంటే పోలీస్ వ్యవస్ద ఎంత పవర్ ఫుల్ అనేది ఈ మూవీలో చూపించారు ఈ చిత్ర దర్శకుడు హరి..

 

 

కాగా ఇప్పుడు ఈ సినిమాలు నిర్మించినందుకు ఎంతగానో సిగ్గుపడుతున్నానని పోలీసులను ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.. ఒకటి కాదు రెండు కాదు పోలీస్‌ కథలతో 5 సినిమాలు తెరకెక్కించినందుకుగానూ నాకునేనుగా గిల్టీగా ఫీలవుతున్నానని తెలిపారు.. ఇలా చెప్పడం వెనకున్న అసలు కారణం పోలీసుల్లో పెరుగుతున్న అవినీతే కారణమట.. ఈ విషయాన్ని నిరూపిస్తూ తమిళనాడు లాక్‌ డౌన్‌ నిబంధనలకు విరుద్ధంగా షాపు తెరిచి ఉంచారని తండ్రి కొడుకులైన జయరాజ్‌, బెనిక్స్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు, వారిని చిత్ర హింసలకు గురిచేసి చంపారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఈ సంఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు కూడా వెళ్లువెత్తున్నాయి.

 

 

ఇప్పటికే ఈ ఘటనపై సినీ ప్రముఖులు కూడా తీవ్ర స్వరంతో స్పందిస్తున్నారు. ఈ నేపధ్యంలో దర్శకుడు హరి కూడా స్పందిస్తూ, ఇలాంటి పనులు చేస్తున్న పోలీసులను హీరోలుగా చూపిస్తూ వారి కధాంశంతో 5 సినిమాలు తీసినందుకు సిగ్గుపడుతున్నా అంటూ కామెంట్ చేశాడు. ఇలాంటి హత్యలు మరోసారి జరగకూడదని కొంత మంది పోలీసుల వల్ల మొత్తం పోలీసు వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.. ఇక సినిమాలో చూపించినంత అందంగా నిజ జీవితంలో ఎవరూ జీవించరన్న విషయం అందరికి తెలిసిందే.. 

మరింత సమాచారం తెలుసుకోండి: