తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరో ల మద్య కాస్త మాటల యుద్దం నడుస్తున్న సంగతి తెలిసిందే.. ఈ మేరకు ఆ స్టార్ హీరోల సినిమా వేడుకలకు వేరే హీరోలు వెళ్ళడం కానీ జరగదు.. అలానే మీడియా ముందు కూడా వారి ప్రస్తావన తీసుకు రారు.. ఇక పోతే గత కొంత కాలంగా మెగా ఫ్యామిలీకి, నందమూరి ఫ్యామిలీ కి మాటలు లేవన్న సంగతి తెలిసిందే.. దాంతో వారి విషయాలను మరొకరు చెప్పుకోరు.. వాటన్నిటికీ చిరంజీవి చెక్ పెట్టేశాడు..

 

 

జూన్ 10 వ తేదీన బాలయ్య తన 60 వ పుట్టిన రోజు జరుపుకున్నారు.. ఆ రోజు సినీ రాజకీయ ప్రముఖులు ఆయనకు తమదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపారు.. ఇక నందమూరి అభిమానుల ఆనందానికి హద్దులు లేవని చెప్పాలి .. అలా వారు ఆయన పుట్టిన రోజు వేడుకల ను ఘనంగా జరిపారు.. కుటుంబ సభ్యుల మధ్య అభిమానుల మద్య ఆయన బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి.. 

 


అదే సమయం లో ఇటీవలే సోషల్ మీడియా లోకి వచ్చిన మెగా స్టార్ చిరంజీవి కూడా ట్విట్టర్ వేదికగా బాలయ్యకు బర్త్ డే విషెస్ తెలిపారు. మా బాలయ్య అంటూ చిరు అప్యాయంగా శుభాకాంక్షలు తెలియ జేశారు. ‘60లో అడుగు పెడుతున్న మా బాలకృష్ణకి షష్టి పూర్తి శుభాకాంక్షలు. ఇదే ఉత్సాహంతో ,ఉత్తేజంతో ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ల సంబరం కూడా జరుపుకోవాలని,అందరి అభిమానం ఇలాగే పొందాలని కోరుకుంటున్నాను. అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.. దీంతో వీరి మధ్య ఎటువంటి ఘర్షణలు లేవని మెగా మరియు నందమూరి అభిమానులు తేల్చి చెప్పారు.. ఆ ట్వీట్ సినీ వర్గాల్లో చర్చ నీయాంశంగా మారడమే కాదు.. చిరంజీవి విష్ చేసి మంచి పని చేశారని అభినందనలు అందుకున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: