వివాదాస్పద కథను ఎంచుకుని రాంగోపాల్ వర్మ సినిమాలు తీస్తూ సినిమాకి పబ్లిసిటీ వచ్చేలా దాని ద్వారా లాభాలు పొందేలా వ్యవహరిస్తారని పవన్ అభిమానులు ఆర్జివి ‘పవర్ స్టార్’ సినిమా గురించి అసలు ప్రస్తావించటం లేదు. గతంలో ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ అనే సినిమా తెరకెక్కించి అనేక వివాదాలు సృష్టించి దాని ద్వారా చాలా వరకు లాభాలు పొందడం జరిగింది. సినిమా లో మేటర్ లేకపోయినా గాని….తెరకెక్కించిన సినిమా చుట్టూ వివాదాలు ఉండటంతో పబ్లిసిటి భయంకరంగా రావడంతో రామ్ గోపాల్ వర్మ కి కోట్లలో డబ్బులు వచ్చినట్లు ఫిలింనగర్ లో వార్తలు వచ్చాయి.

 

IHG's Office?

ఇదే టైమ్ లో ఈ ఏడాది ప్రారంభంలో 'బ్యూటిఫుల్' అనే సినిమాను తెరకెక్కించిన దానిని ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు, దాంతో సినిమాకి చిల్లర కూడా రాని పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రస్తుతం పవన్ అభిమానులు వర్మ ఫార్ములానే అసలు పట్టించుకోకూడదు కాంట్రవర్సీ ద్వారా పబ్లిసిటీ తెచ్చుకుంటాడు కాబట్టి ఆ తర్వాత లాభాలు తెచ్చుకుంటాడు అని భావిస్తూ ‘పవర్ స్టార్’ అనే సినిమా గురించి పెద్దగా ఎక్కడా కూడా డిస్కషన్లు గాని చేయకుండా ఆర్జివి 'పవర్ స్టార్' సినిమాని చాలా లైట్ గా తీసుకుంటున్నట్టు వార్తలు అందుతున్నాయి.

IHG

మామూలుగా అయితే పవన్ కళ్యాణ్ అభిమానులను కెలికితే అది వేరే లాగా ఉంటుంది. ఈ క్రమంలో వారి అభిమానాన్ని క్యాష్ చేసుకోవాలని ఆర్జివి చేస్తున్న ప్రయత్నాలకు ఏ మాత్రం లొంగకుండా 'పవర్ స్టార్' సినిమా గురించి పట్టించుకోకూడదు అని పవన్ అభిమానులు డిసైడ్ అయినట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: