టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఒక పరాజయం లేని డైరెక్టర్ గా కొరటాల శివ కి మంచి పేరు ఉంది. కొరటాల శివ డైరెక్ట్ చేసిన చివరి సినిమా ‘భరత్ అనే నేను’ రిలీజ్ అయ్యి దాదాపు రెండు సంవత్సరాలు అయింది. ఆ తర్వాత చిరంజీవితో సినిమా కన్ఫర్మ్ అయిన తర్వాత కొరటాల శివ అటు ఇటు కాకుండా రెండు సంవత్సరాల పాటు సినిమా లేకుండా రిలీజ్ అవ్వకుండా పోయింది. స్టార్ డైరెక్టర్ కావటంతో కొరటాల శివ కి కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల బట్టి విసుగు తెప్పించే సీజన్ అన్నట్లు ఉంది. పైగా కరోనా వైరస్ రావటంతో ప్రస్తుతం చిరంజీవి తో చేస్తున్న సినిమా మధ్యలోనే ఆగిపోవడంతో ఇరుక్కు పోయినట్టు అయిపోయింది. మళ్లీ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్న దాని విషయంలో కూడా క్లారిటీ లేకపోవడంతో ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఉంటూ కొరటాల టైం వేస్ట్ చాల అవుతున్నట్లు చాలా మంది భావిస్తున్నారు.

 

కానీ చేస్తున్న సినిమా షూటింగ్ ఆగిపోయిన మరోపక్క తన టైం వేస్ట్ కాకుండా కొరటాల శివ ఒక బిగ్ నిర్మాణ సంస్థకు దగ్గరకు వచ్చే స్టోరీల విషయంలో జడ్జిమెంట్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. మేటర్ ఏమిటంటే నిర్మాణ సంస్థకు చెందిన నిర్మాతలు తమ దగ్గరికి వచ్చిన స్టోరీలను ముందు కొరటాల శివ దగ్గరికి పంపించి ఆయన ఓకే చేసిన తర్వాత స్టోరీ లో మార్పులు చేర్పులు అవసరమైతే కొరటాల సూచించిన తర్వాత ఆ సినిమా ఓకే చేస్తున్నారట. దీనికిగాను సదరు నిర్మాణ సంస్థకు చెందిన వాళ్లు భారీ ఎత్తున కొరటాల శివ కి డబ్బులు ఇస్తున్నట్లు సమాచారం.

 

ఏదిఏమైనా కష్టకాలంలో సంక్షోభం సమయంలో కూడా తన తెలివితేటలతో కొరటాల శివ సరికొత్తగా స్టోరీలను ఓకే చేయడం అది కూడా పెద్ద నిర్మాణ సంస్థకు కావటం విశేషం. ప్రజెంట్ డైరెక్టర్ ల అంత సినిమా షూటింగులు చేయకుండా ఇంటిలో ఉంటున్న... కొరటాల ఈ విధంగా ఓ పక్క డబ్బులు సంపాదించడం అనే వార్తలు విని, చాలామంది కొరటాల మామూలోడు కాదు అని అంటున్నారు. మరోపక్క కొరటాల సినిమా లో నుంచి త్వరగానే రిటైర్మెంట్ అవుతున్నట్లు మొన్న ప్రకటించడం జరిగింది. దీంతో ఉన్న అతి తక్కువ టైమ్ లోనే కొరటాల శివ ప్రతి అవకాశాన్ని బాగా ఉపయోగించుకుంటున్నారు. దీంతో ఇండస్ట్రీలో డైరెక్టర్లు అందరూ కొరటాలని చూసి చాలా నేర్చుకోవాలి అని ఈ వార్త విని చాలామంది అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: