సినిమాల్లో ఆసక్తి రేకెత్తించే కథాంశాల్లో గూఢచారి కథలు కూడా ఉంటాయి. ఈ తరహా సినిమాల్లో హీరో, విలన్ మధ్య వచ్చే ఎత్తుకు పైఎత్తులు, థ్రిల్లింగ్ ఎపిసోడ్స్, సస్పెన్స్, యాక్షన్.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. బాండ్ తరహాలో హీరో ఎన్ని ప్లాన్స్ వేస్తుంటూ ఆంతగా రక్తి కడుతుంది సినిమా. కావలిసిందల్లా దర్శకులు ఎంత థ్రిల్లింగ్ గా సినిమాను తెరకెక్కించారు అనేదే. మెగాస్టార్ చిరంజీవిజోనర్ లో చేసిన సినిమా ‘గూఢచారి నెం.1’. శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విడుదలై నేటితో 37 ఏళ్లు పూర్తయ్యాయి.

IHG

 

చిరంజీవి గూఢచారిగా నటించిన ఈ సినిమా 1983 జూన్ 30న విడుదలైంది. యువ హీరోగా చిరంజీవి మంచి పేరు తెచ్చుకుంటున్న సమయంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయింది. సినిమాను సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించడంలో కోడి రామకృష్ణ సక్సెస్ అయ్యారు. విలన్ పాత్రధారి మారు వేషంలో ఉండటం.. పక్షి ద్వారా సందేశాలు రప్పించుకోవడం.. వంటి అంశాలు సినిమాలో ఆకట్టుకుంటాయి. పొరుగు దేశాలకు బాంబులు తయారు చేసి సప్లై చేసే ముఠాను పట్టుకునే ఆపరేషన్ లో ఓ ఆఫీసర్ చనిపోతాడు. తన స్థానంలో ఎంటరైన చిరంజీవి గూఢచారిగా తన నటనతో మెప్పించారు.

IHG

 

సినిమా చిరంజీవికి జోడీగా రాధిక నటించింది. వీరిద్దరిదీ హిట్ పెయిర్ అనే పేరు నిలబెట్టిందీ సినిమా. ఈ సినిమాకు చక్రవర్తి సంగీతం అందించారు. పాటలు కూడా హిట్టయ్యాయి. విజయలక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాను టి. త్రివిక్రమరావు నిర్మించారు. ఈ బ్యానర్ లో చిరంజీవి తర్వాత అనేక సినిమాల్లో నటించారు. కోడి రామకృష్ణ - చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన హిట్ సినిమాగా గూఢచారి నెం.1 నిలిచింది.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: