బాలయ్య సీనియర్ హీరో. ఆయన సినిమాలు అన్నీ మాస్ యాక్షన్ మూవీస్ గానే ఉంటాయి. మధ్యలో ఫ్యామిలీ ఎలిమెంట్స్ జోడించినా బాలయ్య మూవీ అంటే లాజిక్ లేని ఫైట్లు, భారీ డైలాగులు ఉండాల్సిందే ఎపుడో సమరసింహారెడ్డి టైం నుంచి బాలయ్య ఈ ట్రెండ్ కి అలవాటు పడ్డాడు. దాంతో దాన్ని వదలలేకపోతున్నాడు. సరే బాలయ్య ట్రాక్ ని కొంతైనా మారుస్తూ ఉన్నంతలో కొంచెం కొత్తదనాన్ని మాస్ డైరెక్టర్ బోయపాటి తెస్తున్నారు. ఆయన బాలయ్యన్ని సింహా సినిమాలో డాక్టర్ గా చూపించాడు. అలాగే లెక్చరర్ గా కూడా వేషం కట్టించాడు. ఇక లెజెండ్ లో కూడా బాలయ్యని డిఫరెంట్ షేడ్స్ లో చూపించాడు.

IHG

ఇపుడు మూడవ సినిమాలో ఏకంగా అఘోరా పాత్రలో బాలయ్యని చూపించబోతున్నాడు. దీంతో ఈ మూవీ మీద ఆశలు పెరుగుతున్నాయి. ఇవి ఇలా ఉంటే సినిమాలో ఉండాల్సిన నవరసాలు ఎక్కడా మిస్ కాకుండా బోయపాటి చూస్తాడని పేరు. దాంతో ఈ సినిమా మీద హోప్స్ ఉన్నాయి. ఇక బాలయ్య ఇష్టపడే మరో పాత్ర ఇపుడు వెతుక్కుంటూ వచ్చింది. అదే రైతు పాత్ర. ఈ పాత్రతో ఇదే టైటిల్ తో బాలయ్యని డిఫరెంట్ గా ప్రెజెంట్ చేయాలని దర్శకుడి క్రిష్ణ వంశీ అనుకున్నాడు. అయితే అది ఎందుకో వర్కౌట్ కాలేదు.

IHG

ఇపుడు మళ్ళీ రైతు పాత్రలో బాలయ్య నటిస్తున్నాడు. ఈ మూవీ కూడా బోయపాటి సినిమా తరువాత మొదలవుతుంది అంటున్నారు. ఈ మూవీకి కధను, డైలాగ్స్ ని సాయిమాధవ్ బుర్రా సమకూరుస్తున్నాడు. గౌతమీ పుత్ర శాతకర్ణి కి ఆయనే డైలాగ్ రైటర్. అలాగే చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నంబర్ 150 కి కూడా ఆయనే డైలాగ్స్ రాశారు.

IHG

ఇపుడు మనసు పెట్టి సాయి మాధవ్ రాస్తున్నాడు. ఇంతకీ ఈ మూవీకి డైరెక్టర్ ఎవరంటే బీ గోపాల్. బాలయ్యతో 2003లో పల్నాటి బ్రహ్మనాయుడు మూవీ తీసిన ఆయన మళ్ళీ బాలయ్యతో సినిమా చేయడానికి రెండు దశాబ్దాలు పట్టింది మరి. మొత్తానికి బాలయ్య రైతు పాత్రను వదలలేదు, బీ గోపాల్ ని కూడా వదలలేదు అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: