స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న హ్యాట్రిక్ సినిమా పుష్ప. ఆర్య .. ఆర్య 2 వంటి సూపర్ హిట్స్ తర్వాత సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా మీద ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసినప్పటి నుంచే భారీ అంచనాలు మొదలయ్యాయి. ఇక ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా రూపొందించి అయిదు భాషల్లో రిలీజ్ చేయనున్నారు. కన్నడ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా మరో హీరోయిన్ గా నిత్యా మీనన్ .. నివేదా థామస్ ల పేర్లు పరిశీలిస్తున్నారని సమాచారం.  

 

ఇక ఈ సినిమాని ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాగ్డ్రాప్ లో వినూత్నంగా తెరకెక్కిస్తుండగా రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. ఇప్పటికే దేవీశ్రీ సాంగ్స్ ని రెడీ చేసే పనిలో తలమునకలై ఉన్నాడు. ఇక ఈ సినిమాలో ఉన్న మాస్ సాంగ్ ని ప్రత్యేకంగా కంపోజ్ చేసే పనిలో ఉన్నాడట దేవీశ్రీప్రసాద్. ఈ ఐటం సాంగ్ లో నర్తించడానికి బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతెలా లేదా నోరా ఫతేహి లలో ఒకరు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. 

 

అయితే రీసెంట్ గా ఈ సినిమాలో అల్లు అర్జున్ తో ఐటం సాంగ్ లో రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ స్టెప్పులేయబోతుందని వార్తలు వచ్చాయి. అయితే కేవలం అది గాసిప్ మాత్రమే అని తాజాగా అందుతున్న సమాచారం. ఇప్పటి వరకు ఈ ఐటం సాంగ్ కోసం ఎవరినీ ఫైనల్ చేయలేదట. బాలీవుడ్ నుంచి ఊర్వశి రౌతెలా, నోరా ఫతేహి ..ఎవరో ఒకరిని అనుకుంటున్నారు తప్ప ఇంకా అంత ఖచ్చితంగా ఎవరినీ ఒకే చేయలేదట. ఇక ప్రస్తుతం ఫారెస్ట్ బ్యాగ్డ్రాప్ లో షూటింగ్ నిర్వహించాలని సుకుమార్ సెట్ వేయిస్తున్నారు. జూలై ఆఖరు నుంచి లేదా ఆగస్టు మొదటి వారం నుంచి షూటింగ్ మొదలవుతుందని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: