ఇండస్ట్రీలో టాప్ సినిమాటోగ్రాఫర్స్ గా అన్నదమ్ములిద్దరికి చాలా మంచి పేరుంది. ఇద్దరు బ్లాక్ బస్టర్ సినిమాలకి పనిచేశారు. అన్న అయితే తనే డైరెక్టర్ లా ఫీలవుతాడు కూడా. అంతేకాదు హీరోలని మించిపోయాడు. హీరోయిన్స్ అంటే విపరీతమైన మోజు. అవకాశం తీసుకొని మరీ పబ్లిక్ ఫంక్షన్ అని కూడా చూడకుండా హీరోయిన్ ని కౌగిలించుకొని " పుచుక్ " అని ముద్దు పెట్టేస్తాడు. మీడియా వాళ్ళు ఉన్నారు..తనకి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలున్నారు ..హీరోలున్నారు అని ఏమాత్రం జ్ఞానం ఉండదు. పక్కన మేకప్ లో హీరోయిన్ ఉందా ...నాకు మూడొచ్చిందా ...ముద్దు పెట్టి సరదా తీర్చుకున్నానా ..అదీ లెక్క. సీనియ కెమెరామాన్ అయుండి చుట్టూ కెమెరాలున్నాయని కూడా పట్టించుకోడు.

 

IHG

ఇక ఆయన గారికి గొప్ప తమ్ముడనిపించుకున్నాడు ఈ ప్రబుద్ధుడు కూడా. అది సినిమాటోగ్రాఫర్ గా కాదు. అమ్మాయిలను వాడుకోవడంలో. గత కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్స్ సినిమాలకి పనిచేస్తూ బెస్ట్ కెమెరమాన్ అని పేరు తెచ్చుకున్నాడు. అయితే సాయి సుధ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకుంటానని నమ్మించి దాదాపు 5 ఏళ్ళుగా సహజీవనం చేశాడని ఆ అమ్మాయి ఇటీవల కేసు పెట్టింది. అంతే అయ్యగారిని తీసుకెళ్ళి లోపల వేశారు. కాని రెండు రోజుల్లోనే బెయిల్ తీసుకొని బయటకు వచ్చాడు. 

 

IHG's 2nd <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=EPISODE' target='_blank' title='episode-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>episode</a> | OK Telugu

ఎంతైనా టెక్నీషియన్ కదా..టెక్నికల్ తెలివితేటలు ఉపయోగించి ఫోర్జరీ సంతకంతో మళ్ళీ అమ్మాయిని మోసం చేశాడు. ఇద్దరం రాజీకొచ్చామంటూ దొంగ పత్రాలు సృష్ఠించి కొర్టు కళ్ళు గప్పి బయటపడ్డాడు. కాని మోసపోయిన అమ్మాయి మామూలుగా షాకివ్వలేదు. ఈ దెబ్బకి ఈసారీ ఇంకా లోపలికి వెళ్ళేలా ఆధారాలు చూపించి కోలుకోలేని దెబ్బకొట్టింది. కక్కుర్తి కాకపోతే వాడుకోవడం ఎందుకు .. పెళ్ళి చేసుకోవచ్చు కదా.. దరిద్రపు బుద్ది పోనిచ్చుకోలేదు. ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్ళు కష్టపడి సంపాదించుకున్న పేరు మొత్తం సర్వనాశనం చేసుకున్నారు. అన్న అసలు అడ్రస్ లేడు. ఇప్పుడు తమ్ముడు ఏకంగా జైలుకే అంటూ ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు. మొత్తానికి అన్న ముద్దులు పెట్టుకుంటూ సరదాలు తీర్చుకుంటే తమ్ముడు సహజీవనం చేసి సర్వ నాశనం అయిపోయాడు..అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: