పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఎప్పటికప్పుడు సోషల్ యాక్టివ్ గా ఉంటూ అనేక విషయాలు తెలియజేస్తూ ఉంటుంది. నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను తెలియజేస్తూ కొంతమందికి రిప్లై లు కూడా ఇస్తూ ఉంటుంది. సమాజంలో జరిగే అనేక విషయాల గురించి తన వ్యక్తిగత జీవితం గురించి ఏ విషయం కూడా దాపరికాలు లేకుండా రేణుదేశాయ్ సోషల్ మీడియాలో అనేకసార్లు నెటిజన్లతో పంచుకోవడం జరిగింది. ఇదిలా ఉండగా గతంలో పవన్ కళ్యాణ్ తో విడాకుల గురించి అప్పట్లో ఆమె చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. ఇంకా అనేక విషయాల గురించి చాలా నిర్మొహమాటంగా ముఖం మీద రేణు దేశాయ్ ఇంటర్వ్యూలలో సమాధానాలు చెప్పేస్తూ ఉంటుంది.

 

ప్రస్తుతం ఇటీవల రేణుదేశాయ్ మళ్లీ సినిమా రంగంలోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నట్లు స్టేట్మెంట్ కూడా చెప్పటం జరిగింది. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రేణుదేశాయ్ పవన్ కొడుకు అకిరా నందన్ సినిమా ఎంట్రీ గురించి ప్రశ్న వచ్చినప్పుడు రేణు దేశాయ్ సంచలన విషయం బయటపెట్టింది. తాను తల్లిగా అఖిరా నందన్ కి అనేక విషయాలు చెప్పినట్లు కేరియర్ గురుంచి డిస్కషన్ చేసినట్లు చెప్పుకొచ్చింది. నీకు ఇష్టమైన రంగంలో రాణించాలి మనసుకు నచ్చిందే చేయాలి అని తాను అకిరా నందన్ తో డిస్కషన్ చేసినట్లు తెలిపింది.

 

అదేవిధంగా డాడీ (పవన్ కళ్యాణ్), పెదనాన్న చిరంజీవి అదే విధంగా బ్రదర్ రామ్ చరణ్ హీరోల మాదిరిగా సినిమా హీరో అవ్వాలని ఒత్తిడి తెచ్చుకునే విధంగా నిర్ణయం తీసుకోవద్దని…. మనసుకు ఏది అనిపిస్తే అది చేయాలని అకీరాకు తాను సూచించినట్టు రేణుదేశాయ్ తెలిపారు. పైగా అఖీరా వయసు ప్రస్తుతం 16 సంవత్సరాలే...అతనికి ఇంకా భవిష్యత్తు ఉందని రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది. మొత్తం మీద అకీరానందన్ సినిమా ఇండస్ట్రీలో కి త్వరలో వచ్చేస్తాడు అన్న వార్తలకు రేణుదేశాయ్ కామెంట్లు సస్పెన్స్ ఇచ్చినట్లు అయ్యింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: