గోవా బ్యూటీ ఇలియానా ఒంటి మీద ఐదు టాటూలు ఉన్నాయట. ఇది ఎవరో చెబుతున్నది కాదు స్వయంగ ఇలియానానే తన ఫ్యాన్స్ కు వెళ్లడించింది. దేవదాస్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి పోకిరితో పాపులారిటీ తెచ్చుకున్న ఇలియానా ఆ తర్వాత వరుస స్టార్ అవకాశాలను అందుకుంది. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు బాలీవుడ్ నుండి ఆఫర్ రాగానే ఇక్కడ సినిమాలు వదిలేసి వెళ్లింది. అక్కడ క్లిక్ అవని ఇలియానా రష్యన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూతో కొన్నాళ్లు డేటింగ్ చేసింది.

 

ఆండ్రూతో విడిపోయి మళ్లీ సినిమాల మీద ఫోకస్ పెట్టిన ఇల్లి బేబ్.. తెలుగులో చివరగా అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో నటించిన ఇలియానా నాగార్జున సినిమా ఆఫర్ అందుకుందని టాక్. సినిమాలు చేసినా చేయకపోయినా తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ తో సోషల్ మీడియాలో టచ్ లో ఉండే ఇలియానా లేటెస్ట్ గా తన ఫ్యాన్స్ తో చాట్ చేసింది. అందులో భాగంగా ఓ అభిమాని మీ ఒంటి మీద ఎన్ని టాటూస్ ఉన్నాయని అడిగితే దానికి చేతి వేల్లు ఐదు చూపించింది ఇల్లి బేబ్. సో ఆమె చెప్పినదాన్ని బట్టి చూస్తే ఇలియానా ఒంటి మీద ఐదు టాటూలు ఉన్నాయన్నమాట. అయితే అవి ఎక్కడ ఉన్నాయన్నది మాత్రం చెప్పలేదు.

 

సాధ్యమైనంత వరకు మళ్లీ తన మునుపటి ఫాం తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్న ఇలియానా వరుస సినిమాలు చేస్తే కొంతమేరకు బెటర్ గా ఉంటుందని చెప్పొచ్చు. రీసెంట్ గా అందాదున్ తెలుగు రీమేక్ లో నెగటివ్ రోల్ ఛాన్స్ రాగా అది చేయనని చెప్పిందట ఇలియానా. ఆఫర్లు లేనప్పుడు వచ్చిన ఏ చిన్న ఆఫర్ అయినా చేయాలి అలా కాకుండా అమ్మడు మాత్రం తనకు నచ్చిన ఆఫర్ చేస్తా అంటే మాత్రం కష్టమే అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: