సాయి పల్లవి.. అందరి హీరోయిన్లలోకి ఈమె చాలా డిఫరెంట్. ఎంత డిఫరెంట్ అంటే నువ్వు ఏమైనా చేసుకో నేను ఇంతే అనేంత డిఫరెంట్ ఈ భామ. తనకు కథ నచ్చి పాత్ర నచ్చి కంఫర్ట్ గా ఉంటేనే సినిమా చేస్తుంది. లేదంటే మొహం మీదే ఈ పాత్ర నాకు సెట్ అవ్వదు అని చెప్పేస్తుంది. అలా ఉంటుంది సాయి పల్లవి పద్ధతి. 

 

ఇంకా అలాంటి సాయి పల్లవి ఇప్పుడు ఓ యాంకర్ కు ఘాటు వర్కింగ్ ఇచ్చేసింది. తాజా ఓ టీవీ ఇంటర్వ్యూలో యాంకర్ పై సాయి పల్లవి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏంటి అబ్బా అంత పెద్ద వార్నింగ్ అనుకుంటున్నారా? అదేనండీ.. సాయి పల్లవి మొదట మలయాళం సినిమాలో నటించింది కదా! 

 

IHG

 

ప్రేమమ్ లో.. మలర్ పాత్రలో నటించి అందరిని ఆకట్టుకుంది. ఇంకా అందుకే అందరూ ఆమెను మలయాళీ భామ అని ఫిక్స్ అయ్యారు. కానీ ఆమె తమిళ్ అమ్మాయి. ఇంకా ఈ నేపథ్యంలోనే ఓ టీవీ యాంకర్ తనని మళయాళీ అని పిలవగా ఆమె సీరియస్ అయ్యి.. తాను మలయాళీని కాదని స్పష్టం చెప్పేసింది. తాను తమిళ అమ్మాయినని, కోయంబత్తూర్ లో పెరిగానని చెప్పుకొచ్చింది. 

 

ఇంకెప్పుడూ మలయాళీ అని పిలవొద్దని ఓ చిన్న సైజు వార్నింగ్ ఇచ్చింది. దీంతో బిత్తర పోయిన యాంకర్ ఒక్కసారిగా షాక్ కి గురయ్యి సాయిపల్లవి అంటూ సంబోధించడంతో అంత సైలెంట్ అయ్యింది. ఇది అండి సాయి పల్లవి వరుస. కాగా సాయి పల్లవి ప్రస్తుతం రానాతో కలిసి విరాటపర్వం సినిమాలో నటిస్తుంది. అంతేకాదు నాగచైతన్యతో కూడా లవ్ స్టోరీలో నటిస్తుంది. ప్రస్తుతం లీడ్ యాక్టర్స్ లో సాయి పల్లవి ఒకరు. 

మరింత సమాచారం తెలుసుకోండి: