సినిమాల్లో హీరోయిన్లు సినిమాలతో పాటు ఫ్యాషన్ షోలు, ఫొటోషూట్ లు చేయాల్సిందే. నేటి ఫ్యాషన్ యుగంలో ఇది తప్పనిసరి. మ్యాగజైన్ కవర్ పేజీ ఫొటోస్, ఫ్యాషన్ వీక్స్ లో తళుక్కుమనే హీరోయిన్లకు కొత్త సినిమా అవకాశాలు వస్తూ ఉంటాయి. టాలీవుడ్, కోలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలుగొందిన త్రిష కూడా ఇందుకు మినహాయింపు కాలేదు. సౌత్ లో మంచి క్రేజ్ ఉండగానే బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరిక్షించుకోవాలని ట్రై చేసింది. ఈ క్రమంలో బాలీవుడ్ లోని ప్రముఖ మ్యాగజైన్స్ కోసం ఫొటోషూట్స్ లో పాల్గొంది.

IHG

 

ఆ ఫొటోషూట్స్ లోని ఆమె పిక్స్ అప్పట్లో వైరల్ అయ్యాయి. చిన్న చిన్న డ్రెస్సుల్లో త్రిష సెక్సీ లుక్స్ తో అదరగొట్టింది. ఇక్కడ పాపులర్ అయినా బాలీవుడ్ లో కొత్తగా అవకాశాలు రావడానికి అక్కడ కొత్తగా పరిచయం చేసుకోవాల్సిందే. త్రిష ఇదే చేసింది. తన బ్యూటీని బాలీవుడ్ సినీ మ్యాగజైన్స్ లో కవర్ పేజీ స్టిల్స్ గా మార్చింది. మాగ్జిమ్, ఫిలింఫేర్ వంటి బాలీవుడ్ మ్యాగజైన్స్ తో పాటు.. సౌత్ నుంచి వచ్చే గలాటా, సౌత్ స్కోప్ వంటి మ్యాగజైన్స్ కవర్ పేజీల్లోనూ మెరిసింది. ఇంకా పలు బాలీవుడ్, టాలీవుడ్ మ్యాగజైన్స్ తో పాటు.. ఫొటోషూట్స్ లో కూడా పాల్గొంది.

IHG

 

త్రిష అందానికి తన డ్రెస్సింగ్, మేకప్, సెక్సీ ఫిగర్ ఆ ఫొటోషూట్స్ కు మరింత అందం తీసుకొచ్చాయి. హిందీలో సక్సెస్ కాకపోయినా త్రిష అందానికి సౌత్ ఫిదా అయింది. అందుకే హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టి 17ఏళ్లు దాటుతున్నా తరగని అందంతో ఇంకా హీరోయిన్ గా నటిస్తోంది. కొన్ని కారణాల వల్ల చిరంజీవితో సినిమా వదులుకుంది. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్ లో నటిస్తోంది ఈ చెన్నై బ్యూటీ.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: