రామ్ చరణ్ కు అల్లు అర్జున్ కు మధ్య కనిపించని గ్యాప్ ఉంది అన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. అయితే వీరిద్దరూ తమ మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు అంటూ అనేకసార్లు ఓపెన్ గా చెప్పినా జనం మీడియా వర్గాలు ఎదో ఒక రంద్రాన్వేషణ చేస్తూనే ఉంటారు.


ఇలాంటి గాసిప్పులకు మరొకసారి గట్టి సమాధానం ఇచ్చే అవకాశం మళ్ళీ చరణ్ అల్లు అర్జున్ లకు వచ్చింది. ప్రస్తుతం ఒటీటీ ల హవా నడుస్తున్న పరిస్థితులలో ఈ క్రేజ్ ను ‘ఆహా’ కు ఉపయోగించుకోవాలని అరవింద్ చాల గట్టి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.


ఈ ప్రయత్నాలలో భాగంగా తమన్నాని యాంకర్ గా మార్చి ఆహా కోసం ఒక టాక్ షోను ప్లాన్ చేస్తున్నారు. ఈ టాక్ షో మొదటి భాగం రామ్ చరణ్ బన్నీలతో కలిపి ఒక వెరైటీ ఇంతర్వ్యూతో ప్రారంభం అవుతుందని సమాచారం. ఈ ఇంటర్వ్యూలో చరణ్ బన్నీలు తమ చిన్ననాటి విషయాలను షేర్ చేసుకోబోతున్నారని తెలుస్తోంది.


చరణ్ బన్నీలు కలిపి ఇచ్చే ఇంటర్వ్యూ కాబట్టి ఈ ఇంటర్వ్యూతో ‘ఆహా’ యాప్ మరింత పాపులర్ అవుతుందని అరవింద్ నమ్మకం అని అంటున్నారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ తమ జీవితాలు వేరైనా గమ్యం ఒక్కటే అని చెప్పాడు. దీనితో చిరంజీవి పవన్ ల మధ్య అభిప్రాయ భేదాలు కేవలం మీడియా సృష్టి మాత్రమే అన్న సందేహాలు మెగా అభిమానులలో వచ్చాయి. ఇప్పుడు అదే మాటను స్పూర్తిగా తీసుకుని అల్లు అర్జున్ రామ్ చరణ్ లు తమ కెరియర్ లో తమ ఇద్దరి మధ్య పోటీ విపరీతంగా ఉన్నా ఆ విషయాలను పక్కకు పెట్టి ఇప్పుడు ఇలా చిరంజీవిని స్పూర్తిగా తీసుకుని ఆహా ను ప్రమోట్ చేస్తూ అరవింద్ కు జోష్ ను ఇస్తున్నారు అనుకోవాలి. మరి ఈ ఇంటర్వ్యూ ఎంతవరకు వార్తలకే పరిమితం కాకుండా వాస్తవ రూపం దాలుస్తుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: