అల్లు అరవింద్ స్టార్ట్ చేసిన ఓటీటీ వేదిక ఆహాకి మంచి స్పందనే లభించింది. వందశాతం తెలుగు కంటెంట్ ని అందిస్తున్న ఈ యాప్ కి సబ్ స్క్రయిబర్స్ వేగంగా పెరుగుతున్నారు. స్ట్రీమింగ్ సైట్లలో మేజర్ ఫీల్డ్ ని ఆక్రమించుకున్న నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి దిగ్గజ సంస్థలు దూసుకుపోతున్న టైమ్ లో ఆహా అంటూ వచ్చిన సరికొత్త ఓటీటీ వేదిక ప్రేక్షకులకి ఎంగేజ్ చేయడానికి కొత్త కొత్త ప్రోగ్రామ్స్ ని రూపకల్పన చేస్తుంది.

IHG's Aha?

 

అందులో భాగంగానే ఇప్పటికే టాలీవుడ్ దర్శకులతో వెబ్ సిరీస్ లు రూపొందించేందుకు ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఆహా కోసం వెబ్ సిరీస్ రూపొందించే పనిలో చాలా మంది దర్శకులు నిమగ్నమై ఉన్నారు. అయితే ఆహాకి గ్లామర్ సొబగులు అద్దడానికి అన్నట్టు స్టార్ హీరోయిన్ తమన్నాచే ఓ టాక్ షో నిర్వహించడానికి సిద్ధమైంది. ఇందులో టాలీవుడ్ సెలెబ్రిటీలు అతిధులుగా వస్తారు.

 

IHG

అయితే ఈ టాక్ షో నిర్వహించడానికి తమన్నా బాగానే డిమాండ్ చేసిందని టాక్. ప్రస్తుత సమాచారం ప్రకారం తమన్నా ఒక్క ఎపిసోడ్ కి 8లక్షల రూపాయలు పారితోషికం తీసుకోనుందట. సాధారణంగా తమన్నా ఒక్క సినిమాకి కోటి నుండి కోటిన్నర్ పారితోషికం తీసుకుంటుంది. అక్కడ 30 నుండి 45 రోజుల వరకి షూటింగ్స్ లో పాల్గొంటుంది. ఆ లెక్కన చూస్తే ఆహాలో చేస్తున్న టాక్ షోకి తమన్నా చాలా ఎక్కువే తీసుకుంటుందని చెప్పాలి.

 


ఒక్క ఎపిసోడ్ కి 8 లక్షలు అంటే 30 రోజులకి 2కోట్లకి మించి ఉంటుంది. అంటే సినిమాల కంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటుందన్నమాట. 

మరింత సమాచారం తెలుసుకోండి: