మలయాళ నటి గిలు జోసెఫ్‌ ఓ మ్యాగజైన్‌ కవర్‌ పేజ్‌ మీద కనిపించింది. అయితే ఆ ఫోటో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బ్రెస్ట్ ఫీడింగ్‌ చేస్తూ మ్యాగజైన్‌ కవర్‌ పేజ్‌ మీద కనిపించిన ఈ బ్యూటీపై కేసు నమోదైంది. వివాదాస్పద కవర్‌ ఫోటోపై కొల్లం కోర్టులో కేరళ స్టేట్‌ చైల్డ్‌ రైట్స్‌ కమీషన్‌ కేసు వేసింది.

 

ప్రముఖ న్యాయవాది నోబెల్‌ మ్యాథ్యు, కొల్లం చీఫ్‌ జుడిసియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో ఈ కేసు వేశారు. మాతృభూమి అనే మీడియా గ్రూప్‌ పబ్లిష్ చేసే గృహలక్ష్మీ అనే మ్యాగజైన్‌ కవర్‌ పేజ్‌ మీద ఈ వివాదాస్పద ఫోటో ప్రచురితమైంది. అయితే ఈ విషయంపై స్పందించిన మాతృభూమి మేనేజింగ్ డైరెక్టర్‌ ఎమ్‌వీ శ్రేయంస్‌ కుమార్‌ చీప్‌ పబ్లిసిటీ కోసం ఇలాంటి పనులు చేస్తున్నారని విమర్శించాడు.

 

అయితే చైల్డ్ రైట్స్‌ కమిషన్ మాత్రం ఫేక్ ఫీడింగ్‌ కింద కేసును నమోదు  చేసినట్టుగా తెలిపింది. నటిగా, మోడల్‌గా, ఎయిర్‌ హోస్ట్‌గా పనిచేసిన జోసెఫ్‌ మ్యాగజైన్‌ కవర్ పేజ్‌ మీద బ్రెస్ట్‌ ఫీడింగ్ చేస్తూ కనిపించింది. కవర్ చేసుకోకుండా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వటంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపించాయి. అయితే సదరు సంస్థ మాత్రం మహిళల్లో బ్రెస్ట్ ఫీడింగ్‌ విషయంలో అవగాహన  కల్పించేందుకు ఈ కవర్‌ స్టోరినీ ప్రచురించినట్టుగా తెలిపింది.

 

అయితే ఈ మోడల్‌ తో పాటు మరో 23 ఏళ్ల మహిళ అమృత బ్రెస్ట్ ఫీడింగ్‌ ఇస్తున్న ఫోటోలను కూడా మ్యాగజైన్‌ ప్రచురించింది. వివాదంపై స్పందించిన జోసెఫ్ తాను చేసిన ఈ ఫోటో షూట్‌  మహిళలందరికీ అంకిత మని, మహిళలు తమ పిల్లలకు బ్రెస్ట్‌ ఫీడింగ్‌ ఇచ్చే విషయంలో ఓపెన్‌గా ఉండాలని సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: