బాలీవుడ్ లో చేసిన సినిమాలు చాలా తక్కువే అయినా సరే మొదటి సినిమా కోటి రూపాయల వసూళ్లు సాధించడం తో బాలీవుడ్ లోనే కాదు ఇతర భాషల్లో కూడా శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ కి మంచి పేరు వచ్చింది. చేసిన సినిమాలు ఎక్కువగా లేవు గాని ఆమె మాత్రం చాలా మంచి పేరు ని చాలా తక్కువ కాలంలో సాధించింది అనే సంగతి అందరికి ఒక క్లారిటీ ఉంది అనే చెప్పాలి. ఇప్పుడు ఆమె వరుసగా సినిమాలు చేస్తుంది. మన తెలుగు లో కూడా ఆమెకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. మన తెలుగు లో ఆమెకు మంచి పేరు వస్తుంది. 

 

తాను చేసిన తక్కువ సినిమాలే అయినా సరే నటన విషయంలో ఏ మాత్రం కూడా రాజీ లేకుండా తల్లి స్థాయిలో చేస్తుంది అనే పేరు ఆమెకు చాలా ఫాస్ట్ గా రావడం తో ఆమెకు అది బాగా కలిసి వచ్చింది అనే చెప్పాలి. ఇప్పుడు ఆమె బాలీవుడ్ లో మూడు సినిమాలు చేస్తుంది. తెలుగు లో ఎన్టీఆర్ తో కూడా ఒక సినిమా చేసే అవకాశం ఆమెకు వచ్చింది అని అంటారు గాని అది నిజమా కాదా అనేది ఎవరికి స్పష్టంగా తెలియదు. ఆమె ఇప్పుడు మన తెలుగు లో చేయడానికి గానూ రెడీ అయ్యారు అని కాని ఆమె చేయడం లేట్ అయ్యే అవకాశం ఉంది అని టాలీవుడ్ లో టాక్ మరి. 

 

ఇక ఇదిలా ఉంటే ఆమె గురించి ఒక విషయం ప్రత్యేకంగా చెప్పేది ఏంటీ అంటే... మ్యాగజైన్ స్టోరీ లలో ఆమె  బాగా కనపడుతుంది ఇప్పుడు. ప్రముఖ పత్రికలూ గాని ప్రముఖ వ్యాపార సంస్థలు గాని ఆమెను బాగానే వాడుతున్నాయి అని అంటున్నారు. ఆమెకు ముంబై లో కమర్షియల్ గుర్తింపు రావడం బాగా కలిసి వచ్చిన అంశంగా చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: