సినీ రంగాన్ని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఉత్తరాదిలో వరుసగా లెజెండరీ ఆర్టిస్ట్‌లు మరణించటం తరువాత సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌, మోక్ష, టిక్‌ టాక్‌ స్టార్‌లు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు ఇండస్ట్రీని కుదిపేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా దక్షిణాదిలోనూ ఓ నటి ఆత్మహత్యకు పాల్పడింది.  కన్నడ ఇండస్ట్రీలో వ్యాఖ్యతగా, నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న చందన ఇటీవల ఆత్మహత్య చేసుకొని మరణించింది.

 

ప్రేమలో మోసపోయినందుకే తాను సుసైడ్‌ చేసుకుంటున్నానని ఓ వీడియో మెసేజ్‌ను రిలీజ్  చేసి మరీ ఆమె ఆత్మహత్య చేసుకుంది. కొన్నేళ్లుగా చందనతో ప్రేమలో ఉండటంతో పాటు ఆమెతో శారీరక సంబంధం కూడా ఉన్న ఆమె ప్రియుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం దినేష్ అనే యువకుడ్ని అరెస్ట్ చేసిన బెంగళూరు పోలీసులు రిమాండ్‌ కు తరలించారు.

 

టెలివిజన్ యాంకర్‌, యాక్ట్రస్‌ చందన సూసైడ్‌ సాండల్‌వుడ్‌ లో సంచలనం సృష్టించింది. లవర్‌ మోసం చేసినందుకే చందన పాయిజన్‌ తాగి సూసైడ్‌ కు పాల్పడింది. తవరేకెరే లోని కృష్ణమూర్తి లే అవుట్‌ లో నివసిస్తున్న చందన మే 28 న ఆత్మహత్యకు పాల్పడింది. అయితే కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించినా అప్పటికే ఆమె మృతి చెందినట్టుగా డాక్టర్లు తెలిపారు.

 

చందన గత 5 సంవత్సరాలుగా నిందితుడు దినేష్‌తో ప్రేమలో ఉంది. అతను చందన నుంచి 5 లక్షల వరకు  డబ్బు తీసుకోవటంతో పాటు ఆమెను శారీరకంగానూ వేదించాడని వీడియోలో తెలిపింది చందన. అతను పెళ్లి చేసుకుంటాడన్న నమ్మకంతో చందన చాలాసార్లు శారీరకంగానూ అతనితో కలిసింది. ఆత్మహత్యకు ముందు పోస్ట్ చేసిన వీడియోలో ఈ విషయాలను వెల్లడించింది చందన. కుటుంబ సభ్యుల కంప్లయింట్‌తో దినేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: