పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇద్దరు ఒకే సారి సినిమా రంగంలో కథానాయకులుగా సినీరంగంలో అడుగు పెట్టారు. ఇద్దరు హీరోలకు తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీళ్లిద్దరూ కూడా మంచి సినిమా స్క్రిప్ట్ లను ఎంచుకుని సూపర్ హిట్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించి అందరి చేత ప్రశంసలను దక్కించుకున్నారు. పవన్ కళ్యాణ్ కాదన్న స్క్రిప్టులలో మహేష్ బాబు నటించి సూపర్ డూపర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అత్తారింటికి దారేది చిత్రంతో పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తే...  సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో మహేష్ బాబు మరొక సంచలనం సృష్టించాడు.


మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ సినిమా తో హిట్ సాధిస్తే... పవన్ కళ్యాణ్ గబ్బర్సింగ్ సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించారు. పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ లు అప్పట్లో సూపర్ పాపులర్ అయ్యాయి. అలాగే మహేష్ బాబు బిజినెస్మేన్ లో చెప్పిన డైలాగులు కూడా తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులారిటీ సంపాదించాయి. ఏడాదిలో మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటించే సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే పదం తో మహేష్ బాబు సినిమా ప్రేక్షకులను బాగా అలరించిందని చెప్పుకోవచ్చు. 


అయితే అప్పట్లో పవన్ కళ్యాణ్ మహేష్ బాబు సినీ రంగ ప్రవేశం చేసే సమయంలో ఫోటో షూట్ కి స్టిల్ ఇచ్చారు. అందులో పవన్ కళ్యాణ్ అందంగా కనిపించేందుకు మంచిగా టై కట్టుకొని జుట్టు చక్కగా దువ్వుకుని సూపర్ గా ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ పలికించాడు. మహేష్ బాబు మాత్రం సింపుల్ గా ఒక బొట్టు పెట్టుకుని టీ షర్ట్ లో కనిపించాడు. అయితే పవన్ కళ్యాణ్ 96 సంవత్సరంలో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేయక మహేష్ బాబు 99 లో విడుదలైన రాజకుమారుడు చిత్రంలో హీరోగా నటించే తన నటనా చాతుర్యాన్ని చూపించి తండ్రికి తగ్గ కొడుకు గా పేరు సంపాదించుకున్నాడు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ మహేష్ బాబు కెరీర్ తొలినాళ్లలో వారి గోల్డెన్ డేస్ చాలా బాగున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: