బాలీవుడ్‌ యువ కథానాయకుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ ఆత్మహత్య ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఇండస్ట్రీ నుంచి చాలా మంది ప్రముఖులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకోగా, మరికొంత మంది సవ్యంగా పాట్నాలోని సుశాంత్ ఇంటికి వెళ్లి పరామర్శిస్తున్నారు. బాలీవుడ్‌ లెజెండరీ ఆర్టిస్ట్‌ నానా పటేకర్‌ కూడా ఆయన ఇంటికి వెళ్లి నివాళి అర్పించటంతో పాటు కుటుంబ సభ్యులను ఓదార్చాడు.

 

తరువాత సుశాంత్ కుటుంబ సభ్యులను వ్యాఖ్యత నటుడు శేఖర్‌ సుమన్‌ కూడా పరామర్శించారు. సుశాంత్ స్నేహితుడు సందీప్‌ సింగ్ స్వయంగా శేఖర్‌ సుమన్‌ వెంట ఉండి కుటుంబ సభ్యుల వద్దకు తీసుకెళ్లాడు. సుశాంత్‌ ఫ్యామిలీని కలిసిన తరువాత శేఖర్ సుమన్‌ ఆర్జేడీ చీఫ్‌ తేజస్వీ యాదవ్‌తో కలిసి ప్రెస్‌ మీట్‌ ఏర్పాటు చేశాడు. ఈ ప్రెస్‌మీట్‌లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశాడు. సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతిపై సీబీఐ ఎంక్వయిరీ జరపాలని డిమాండ్‌ చేశాడు శేఖర్‌ సుమన్. అయితే ఈ ప్రెస్‌ మీట్‌పై సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

సుశాంత్‌ మృతిని రాజకీయ అవసరాల కోసం వినియోగించుకోవటం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు ఫ్యామిలీ మెంబర్స్‌. అంతేకాదు శేఖర్‌ సుమన్‌ నిర్వహించిన ప్రెస్‌మీట్‌ సుశాంత్ స్నేహితుడు సందీప్‌ సింగ్‌కు పాల్గోనటంపై కుటుంబ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  గత ఎన్నికల్లో శేఖర్ సుమన్‌ కాంగ్రెస్‌ తరుపున బీహార్‌లో పోటి చేశాడు, తరువాత ఆర్జేడీ పార్టీలో చేరాడు. 

 

ప్రస్తుతం సుశాంత్ మృతికి సంబంధించిన విషయంపై ముంబై పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే ఈ సమయంలో ఈ విషయాన్ని రాజకీయం చేయవద్దని కోరుతున్నారు సుశాంత్ కుటుంబ సభ్యులు. ఇప్పటికే సుశాంత్ మరణించి 15 రోజులు గడుస్తున్నా ఏదో ఒక వివాదం తెర మీదకు వస్తూనే ఉంది. సుశాంత్ మృతితో షాక్ అయిన ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: