ఇప్పుడు లూసిఫర్ సినిమా గురించి టాలీవుడ్ లో చాలానే వార్తలు వస్తున్నాయి. చిరంజీవి సినిమా కావడంతో టాలీవుడ్ జనాలు అందరూ కూడా ఇప్పుడు ఈ సినిమా కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. మలయాళం లో ఈ సినిమా మోహన్ లాల్ చేసిన సంగతి తెలిసిందే. ఇక తెలుగు లో చిరంజీవి చేస్తున్న నేపధ్యంలో ఆయన ఏ విధంగా చేస్తారు అనే ఆసక్తి అందరిలో ఉంది. ఇక దర్శకుడు సుజిత్ అని కొందరు అనీల్ రావిపూడి అని కొందరు అంటూ ఉంటారు గాని దర్శకుడు ఎవరు అనేది స్పష్టత మాత్రం రావడం లేదు.

 

వీవీ వినాయక్ చేసే అవకాశాలు ఉన్నాయి అని కొందరు అంటున్నారు గాని దీనిపై ఇంకా స్పష్టత మాత్రం ఇవ్వడం లేదు. చిరంజీవి కి మాత్రం యువ దర్శకుడి తో సినిమా చెయ్యాలి అని ఉందని అదే మాట నిర్మాత రామ్ చరణ్ కి కూడా చెప్పారు అని రామ్ చరణ్ కూడా అదే విధంగా అడుగులు వేస్తున్నాడు అని అంటున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో జగపతి బాబు నటించే అవకాశం ఉంది. అలాగే కుష్బూ కూడా నటించే సూచనలు ఉన్నాయి అని టాలీవుడ్ లో టాక్. లూసిఫర్ ఒరిజినల్‌లో మోహన్‌లాల్ సోదరిగా మంజు వారియర్ నటించారు. 

 

ఈ సినిమాలో ఆ పాత్ర కోసం కుష్బూ ను తీసుకునే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. ఇప్పటికే విజయశాంతి, సుహాసినిల పేర్లు వినిపించాయి. కాని వారు కాదని... కుష్బూ ని తీసుకునే అవకాశం ఉంది అని అంటున్నారు. మంజు వారియర్ రెండో భర్తగా చేసిన వివేక్ ఒబెరాయ్ పాత్రలో జగపతి బాబు ని తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీనిపై త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా త్వరలోనే మొదలు కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: