టాలీవుడ్ లో కమర్షియల్ సినిమాలకు సంబంధించి కాస్త జాగ్రత్తలు ఎక్కువగానే తీసుకుంటున్నారు స్టార్ హీరోలు అందరూ కూడా. చిన్న చిన్న హీరోల సినిమాల్లో నటించడం లేదా మరో అగ్ర హీరో సినిమాలో నటించడం వంటివి ఎక్కువగా చేస్తున్నారు. అగ్ర హీరోలు అందరూ కూడా ఇప్పుడు దీనినే మార్కెట్ గా భావిస్తున్నారు. ప్రస్తుతం మన తెలుగులో ఈ ట్రెండ్ బాగా నడుస్తుంది. అగ్ర హీరోల సినిమాలకు మార్కెట్ కూడా భారీగా పెరుగుతున్న నేపధ్యంలో ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా  దీనికి సంబంధించి ఇప్పుడు మంచి క్రేజ్ అనేది వస్తుంది. 

 

ఇక ఇదిలా ఉంటే మెగా హీరోలు అందరూ కూడా ఇప్పుడు తమ ఫ్యామిలీ హీరోలతో చేయడానికి రెడీ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలో రామ్ చరణ్ నటించే అవకాశం ఉంది అనే వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి టాలీవుడ్ లో ఇప్పుడు చర్చలు కూడా నడుస్తున్నాయి. రామ్ చరణ్ ఈ సినిమాలో చేయడానికి రెడీ అయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అని సమాచారం. గెస్ట్ పాత్రలో మాత్రమే అతను నటించే అవకాశం ఉందని దాదాపు అతను పది నిమిషాల పాటు కనపడే అవకాశం ఉందని అంటున్నారు. 

 

క్రిష్ పవన్  సినిమాలో పోలీస్ పాత్రలో రామ్ చరణ్ నటించే అవకాశం ఉంది అని సమాచారం. ఇది నిజమా కాదా అనేది తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఇదే ట్రెండ్ నడుస్తుంది. అదే ట్రెండ్ ని... రామ్ చరణ్ కూడా ఫాలో అవుతున్నాడు. కాగా క్రిష్ పవన్ సినిమా వచ్చే ఏడాది  ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని తెలుస్తుంది. మరి ఎప్పుడు వస్తుంది ఏంటీ అనేది చూడాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. పవన్ ప్రస్తుతం వకీల్ సాబ్ లో చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: