కొన్ని రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైన అంశం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు గురేంచే. టీటీడీ, ఇసుక, ఇళ్లు.. విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో భగ్గుమన్నాయి. కొందరు ఎమ్మెల్యేలకు ఆయనకు మధ్య మొదలైన మాటల యుద్ధం ఏకంగా షోకాజ్ నోటీసుల వరకూ వెళ్లిపోయింది. తనకు రక్షణ కావాంటూ లోక్ సభ స్పీకర్ కు ఆయన లేఖ ఇచ్చేంత తీవ్రమైందీ ఈ విషయం. రఘురామకృష్ణరాజు కూడా ఏమాత్రం తగ్గకుండా మీడియాలో తన వాదనలు వినిపిస్తున్నారు. ఇప్పుడు ఈయన తీరుపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించడం చర్చనీయాంశమైంది.

IHG

 

‘నాకు క్యాస్ట్ ఫీలింగ్ లేదు. కానీ.. రఘురామకృష్ణ రాజు ఫీలింగ్ ఉంది. నిజం మాట్లాడటంలో ఆయన సింహం.. ధైర్యంలో ఆయన పులిలాంటి వ్యక్తి. ఆయన ఒక హీరో. సింహం ఒక్కటే సింగిల్ గా..’ అంటూ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఇటివల రఘురామకృష్ణరాజుకు వర్మపై స్పందిస్తూ ఆయన యూట్యూబ్ అకౌంట్ ను ఫాలో అవుతాను. ఇద్దరం ధైర్యం ఉన్న వ్యక్తులమే. తక్కువ మాట్లాడతాం.. ఎక్కువ ప్రభావం చూపుతాం.. అంటూ స్పందించారు. దీంతో రామ్ గోపాల్ వర్మ కూడా ఆయనపై ట్విట్ చేశారు. క్యాస్ట్ ఫీలింగ్ లేదని వర్మ చెప్పినా ఆయనపై కౌంటర్లు వేస్తున్నారు కొందరు నెటిజన్లు.

IHG

 

‘క్యాస్ట్ ఫీలింగ్ తో మెసేజ్ చేసి మళ్లీ క్యాస్ట్ ఫీలింగ్ లేదంటావేంటి వర్మా’.. ‘నీ ట్వీట్ కి వాల్యూ ఉందా’ అంటూ వర్మపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఆర్జీవీకి అక్కర్లేని విషయం ఉండదని తెలిసిందే. పనిలోపనిగా రాజకీయాలపై కూడా ఓ ట్వీట్ వేసేశాడు. అసలే వైసీపీకి రఘురామకృష్ణరాజుకు మధ్య ఉప్పు నిప్పులా ఉన్న పరిస్థితులను ఆర్జీవీ తన ట్వీట్ తో సెగ పెంచేలానే ఉంది. దీంతో.. నెటిజన్ల ట్రోలింగ్ కు గురయ్యాడు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: