టాలీవుడ్ లో రాఘవేంద్ర రావు గురించి ఈ  తరానికి పెద్దగా పరిచయం లేదు అప్పట్లో ఆయన సినిమాలు అనగానే జనాలకు ఒక రేంజ్ లో క్రేజ్ అనేది ఉంటుంది. ఆయన సినిమాలు అనగానే అప్పట్లో యూత్ కి ఒక రేంజ్ లో క్రేజ్ అనేది ఉండేది. ఆయన సినిమా వస్తుంది అంటే చాలు జనాలు హాల్ కి పరుగులు తీసిన రోజులు కూడా ఉన్నాయి. ఇక నిర్మాతలకు కూడా ఆయన సినిమా అనగానే కాసుల పంట అనే సంగతి చాలా మందికి ఈ తరం వాళ్లకు పెద్దగా తెలియదు అనే చెప్పాలి. ఇప్పుడు ఆయన సినిమాలు చేయడానికి  దూరంగా ఉన్నారు. 

 

సినిమాలు పెద్దగా చేయడం లేదు. అయితే సీరియల్స్ మీద మాత్రం ఆయన ఫోకస్  పెట్టారు. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు ఆయన ఒక మాస్ సినిమాను చెయ్యాలి అని ప్లాన్ చేస్తున్నారు అని టాలీవుడ్ లో టాక్. వెంకటేష్ తో ఒక మాస్ కథాంశం తో సినిమా చేస్తున్నారు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. వెంకటేష్ విజయశాంతి తో కలిసి ఏవండి ఆవిడోచ్చింది  సినిమా లాంటి సినిమా చెయ్యాలి అనే ప్లాన్ చేస్తున్నారు అని టాక్. దీనికి సంబంధించి ఆయన ఒక కథ కూడా సిద్దం చేస్తున్నారు అని టాక్. మరి నిజమా కాదా అనేది తెలియదు గాని వెంకటేష్ అందుకు ఓకే చెప్పారు అని అంటున్నారు. 

 

సురేష్ బాబు నిర్మాతగా ఈ సినిమా వచ్చే అవకాశం ఉంది. ఆ కథకు సంబంధించి ఇప్పుడు తుది మెరుగులు దిద్దే ఆలోచనలో ఉన్నారట. కొన్ని కొన్ని మార్పులు వెంకటేష్ చెప్పాడు అని దానికి ఆయన కూడా ఓకే అని కథను మారుస్తున్నారు అని టాలీవుడ్ లో టాక్ మరి. ఈ సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: