కొద్దిగా క్రేజ్ వచ్చింది అంటే చాలు కథానాయికల క్రేజీ పిక్ మేగజైన్ కవర్ పేజ్ పై రావాల్సిందే. అలా వచ్చింది అంటే అమ్మడికి ఫాలోయింగ్ పెరిగినట్టే లెక్క. ఇక కొంతమందికి క్రేజ్ వచ్చినా రాకున్నా వారు చేసే ఫోటో షూట్స్ బాగా వైరల్ అవుతాయి. ఆ రకంగా కూడా మేగజైన్ కవర్ పేజ్ ఎక్కేస్తారు. ప్రైవేట్ గా ఫోటో షూట్ ఏర్పాటు చేసినా అవి ఆడియెన్స్ ను మెప్పించేలా ఉంటే వాటిని కూడా ఏదో ఒక మేగజైన్ కొనేసి కవర్ పేజ్ పై ఉంచుతుంది.

 

ఓవిధంగా చెప్పాలంటే హీరోయిన్ ఫాం లో ఉంది అంటే ఏదో ఒక మేగజైన్ కవర్ పేజ్ మీద కనిపించాల్సిందే. ఇప్పుడంటే ఎక్కడ చూసినా స్మార్ట్ ఫోన్లు వచ్చాయి కాని ఒకప్పుడు హీరోయిన్ మేగజైన్ కవర్ పేజ్ చూసే ఆ మేగజైన్ కొనే వారంటే మేగజైన్ కవర్ పేజ్ కు ఎంత డిమాండ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. అప్పటి సితార, సంతోషం లాంటి మేగజైన్ కవర్ పేజ్ లో ఫోటో వస్తే అదేదో పెద్ద క్రేజ్ అన్నట్టుగా భావించే వారు.

 

బాలీవుడ్ లో అయితే హీరోయిన్స్ అందాలతో సెపరేట్ గా ఓ ఫోటో షూట్ చేసి ఇయర్ కింగ్ ఫిషర్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు. అక్కడ ఫాం లో ఉన్న ప్రతి హీరోయిన్ బికిని వేసుకుని మరి ఆ కింగ్ ఫిషర్ కోసం ఫోటో షూట్ చేయాల్సిందే. అయితే ఈ ఫోటో షూట్స్ కోసం భామలు వారి క్రేజ్ ను బట్టి డిమాండ్ చేస్తారని తెలుస్తుంది. ఇక ఈ మేగజైన్ కవర్ పేజ్ కవరేజ్ కోసం కొంతమంది సెపరేట్ కెమెరా మెన్ వర్క్ చేస్తుంటారు. వారి కెమెరాకి చిక్కారంటే ఏ హీరోయిన్ అయినా పాలరాతి బొమ్మగా మారిపోవాల్సిందే.       
 

మరింత సమాచారం తెలుసుకోండి: