మెగాస్టార్ చిరంజీవి అంటే మెగాభిమానులకు ఎంత ఇష్టమో తెలిసిన విషయమే. చిరంజీవి అభిమానిగా దశాబ్దాలుగా ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నారు అభిమానులు. ఆయన కొత్త సినిమా రిలీజ్ నే పండుగలా భావించే అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఆయన పుట్టినరోజును మరింత ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఆగష్టు 22న మెగాస్టార్ పుట్టినరోజుకు నిర్వహించాల్సిన కార్యక్రమాలను దాదాపు రెండు నెలల ముందే ప్లాన్ చేశారు. ఈసారి ఆయన పుట్టినరోజు సందర్భంగా లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన తెలుగు రాష్ట్రాల్లోని ధియేటర్ స్టాఫ్ కు అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు.

IHG

ఈమేరకు మెగా ఫ్యాన్స్ ను నడిపించే రాష్ట్ర చిరంజీవి యువత కొత్త కార్యాచరణను రూపొందించింది. ‘కరోనా, లాక్ డౌన్ పరిస్థితుల వల్ల మూడు నెలలుగా ఉపాధి కోల్పోయిన రెండు తెలుగు రాష్ట్రాల్లోని ధియేటర్ స్టాఫ్ కు సాయం చేయాలని నిర్ణయించాం. వారికి బియ్యం, కూరగాయలతో పాటు నిత్యావసరాలు, శానిటైజర్లు అందిస్తాం’ అని ఓ ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో రాష్ట్ర చిరంజీవి యువతతోపాటు రాష్ట్రీయ రామ్ చరణ్ యువశక్తి కూడా పాల్గొంటుందని తెలిపారు.

IHG

కొత్త సినిమాలకు కటౌట్లు, బ్యానర్లు, పూల-పాలాభిషేకాలు, హారతులు పట్టడం దశ నుంచి వారని సమాజ సేవ వైపుకు కూడా అడుగులు వేయించడంలో మెగాస్టార్ సూపర్ సక్సెస్ అయ్యారనేది నిర్వివాదాంశం. 22ఏళ్ల క్రితం హైదరాబాద్ లో ప్రారంభించిన చిరంజీవి బ్లడ్, ఐ బ్యాంక్ సేవల నుంచి చిరంజీవి తన అభిమానులకు మార్గదర్శకంగా నిలాచారు. ప్రతి ఏటా మెగా హీరోల పుట్టినరోజున అన్నదానం, రక్తదానంతో పాటు అనేక సామాజిక సేవలు చేస్తూనే ఉన్నారు. ఈసారి తమ అభిమాన హీరో పుట్టినరోజును చిరంజీవి సినీ కార్మికులకు సీసీసీ ద్వారా నిత్యావసరాలు అందించిన విధంగా ఆయన బాటలోనే నడవనున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: