ఇప్పుడు కెరీర్ పరంగా ఎన్టీఆర్ కి ఏ మాత్రం ఇబ్బంది లేదు. అతని సినిమాలకు చాలా మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. స్టార్ హీరో గా ఆయన ఒక రేంజ్ లో ఇమేజ్ తెచ్చుకున్నారు. ఆయన సినిమాలు అనగానే యూత్ లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. దాదాపు ఇప్పుడు ఏడాదికి ఒక సినిమా అయినా సరే రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడు తారక్ అనే ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో బాగానే జరుగుతుంది. అవును అతను ఒక సినిమా అయినా ఏడాదికి విడుదల చెయ్యాలి అని చూస్తున్నాడు అని అంటున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాను ఓకే చేసి దాదాపు రెండేళ్ళు అయింది. 

 

ఇంకా ఏడాది వరకు పట్టే అవకాశాలు ఉన్నాయి అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ ఏడాది లో ఆయన ఇంకో సినిమా విడుదల చేస్తే అది ప్లస్ అవుతుంది. ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడా కనపడట౦ లేదు. ఇప్పుడు ఇంకో సినిమా చెయ్యాలి అంటే కచ్చితంగా లుక్ అనేది మారాల్సిన అవసరం ఉంది అనే సంగతి తెలిసిందే. కాని ఇప్పుడు ఆ లుక్ మారడానికి గానూ రాజమౌళి అంగీకరించడం లేదు అని టాలీవుడ్ లో జనాలు అంటున్నారు. ఇప్పుడు అనవసర్మగా ఇరుక్కుని పోయా అనే భావన తారక్ లో ఉంది అని టాలీవుడ్ లోజనాలు అంటున్నారు మరి. 

 

అతను ఇప్పుడు ఎటూ కాని పరిస్థితి లో ఉన్నాడు అనేది టాలీవుడ్ లో మాట్లాడే మాట. ఒక సినిమాకు మూడేళ్ళ సమయం అంటే స్టార్ హీరో కి అది బాగా ఇబ్బందికర పరిస్థితే అనే సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు అతను ఇక ఈ సినిమా పూర్తి  కాగానే ఏడాదికి ఒక సినిమా అయినా సరే ఎలా అయినా విడుదల చెయ్యాలి అని భావిస్తున్నాడు అని టాలీవుడ్ లో అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: