టాలీవుడ్ లో మంచు హీరోలకు మోహన్ బాబు తర్వాత అంత మంచి ఇమేజ్ అనేది రాలేదు. వాళ్ళు సినిమాలు చేస్తుంటే పెద్దగా జనాలకు ఈ మధ్య కాలంలో ఆసక్తి లేదు అనే చెప్పాలి. నటన పరంగా మంచు హీరోలు చాలా వరకు న్యాయం చేసినా సరే వాళ్ళు ఎంచుకునే కథలు మాత్రం వారిని  బాగా ఇబ్బంది పెట్టాయి అనే విషయం అందరికి తెలిసిందే. స్టార్ ఇమేజ్ ఉన్నా సరే వాళ్ళు మాత్రం సినిమాలను చేయడం లో వాటి కథలను సరిగా ఎంచుకోవడం లో ఘోరంగా విఫలం అవుతారు అనే పేరు ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు అనే వార్తలు వస్తున్నాయి. 

 

స్టార్ హీరోల సినిమాల్లో మంచి పాత్రలు చేసే ఆలోచన లో వారు ఉన్నారు అని టాలీవుడ్ లో అంటున్నారు. వారికి అందరి తో మంచి పరిచయాలు ఉన్నాయి. ఇప్పుడు మంచు మనోజ్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో విలన్ గా చేసే అవకాశం ఉంది అని టాక్ మరి. ఆ సినిమాకు సంబంధించి ఇప్పటికె చర్చలు కూడా పూర్తి చేసారు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి మరి. దీనికి సంబంధించి మనోజ్ 2 కోట్ల వరకు తీసుకుంటున్నాడు అని అంటున్నారు. ఇక ఎన్టీఆర్ కూడా మంచి ఫ్రెండ్ కావడం తో ఈ సినిమాకు ప్రాణం పెట్టి నటిస్తా అని చెప్పాడట. 

 

ఇప్పుడు అతను ఒక భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఆ సినిమా ఏ రేంజ్ లో మంచు మనోజ్ కి పేరు తీసుకుని వస్తుంది అనేది చూడాలి. ఇప్పుడు టాలీవుడ్ లో అతనికి ఇమేజ్ ని నిలబెట్టేది ఆ సినిమా ఒకటే అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: