మన తెలుగు సినిమాలు ఇప్పుడు చాలా వరకు ఇబ్బందుల్లో ఉన్నాయి. సినీ కార్మికులు అందరూ కూడా నానా బాధలు పడుతున్నారు. అగ్ర హీరోలతో సినిమాలు అనగానే వేలాది మంది కార్మికులు వేలాది మంది ఇతర చిన్నా పెద్దా నటులు అందరూ కూడా కలిసి పని చేస్తారు. ఒక సినిమా పూర్తి కావాలి అంటే వారు పడే కష్టం అంతా ఇంతా కాదు అనే సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు వాళ్ళు అందరూ కూడా సినిమాలు లేక నానా బాధలు పడుతున్నారు. ఇక సినిమాల్లోకి వెళ్ళాలి అంటే కరోనా భయం వారని బాగా ఇబ్బంది పెడుతుంది. 

 

దీనితో ఇప్పుడు వారు సినిమాల విషయంలో దాదాపుగా వెనక్కు తగ్గుతున్నారు. ఈ తరుణంలో చిరంజీవి ఒక నిర్ణయం తీసుకున్నారు అని సమాచారం. ఆయన చేస్తున్న ఆచార్య సినిమాకు సంబంధించి సినీ కార్మికులకు అండగా ఉండాలి అని ఆయన నిర్ణయం తీసుకున్నారు అని అంటున్నారు. సినీ కార్మికులకు తన సినిమాలో చేసే వారికి బీమా కల్పించే యోచనలో ఉన్నారు అని టాలీవుడ్ లో జనాలు అంటున్నారు మరి. అది నిజమా కాదా అనేది ఇంకా స్పష్టంగా జనాలకు తెలియదు గాని ఆయన మాత్రం ఈ నిర్ణయం తీసుకున్నారు అని తెలుస్తుంది. 

 

దీనికి సంబందించి చిత్ర నిర్మాత రామ్ చరణ్ తో కూడా ఆయన చర్చలు జరిపారు అని ఆయన కూడా అందుకు ఓకే చెప్పారు అని టాక్. త్వరలోనే వారు అందరికి బీమా చేయించే ఆలోచనలో చిరంజీవి ఉన్నారు అని అంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రక్రియ మొదలు పెట్టి వారు అందరితో సినిమాను మొదలు పెట్టే ఆలోచన చేస్తున్నారు అని టాక్. మరి అది ఎంత వరకు ఫలిస్తుంది అనేది చూడాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇప్పుడు ఆచార్య సినిమా 60 శాతం పూర్తి అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: