ఇప్పుడు మన తెలుగులో మంచి డిమాండ్  ఉన్న హీరోల్లో ఒకరు అల్లు అర్జున్. అల్లు అర్జున్ సినిమాలు అనగానే టాలీవుడ్ లో ఒక క్రేజ్ అనేది వచ్చింది. బాబు సినిమా వస్తుంది అంటే చాలు ప్రేక్షకులు ఒక రేంజ్ లో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు అనే సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అతని సినిమాలకు అన్ని విధాలుగా కూడా ఫాలోయింగ్ అనేది ఉన్న సంగతి తెలిసిందే. మార్కెట్ విషయంలో కూడా అతనికి కలిసి వచ్చే విధంగానే పరిస్థితులు ఉన్నాయి అనే విషయం అందరికి తెలిసిందే. రెండేళ్ళ పాటు అతనికి ఇప్పుడు ఖాళీ అనేది దాదాపుగా లేదు అనే చెప్పాలి. 

 

ఈ రెండేళ్ళు కూడా అతను స్టార్ దర్శకులతోనే సినిమాలు చేసే అవకాశం  ఉంది. లేదా ఇప్పుడు చేసే సినిమాకు రెండేళ్ళు పట్టినా సరే ఆశ్చర్యం మాత్రం లేదు అనే చెప్పాలి అని టాలీవుడ్ టాక్. అతను ఇప్పుడు దాదాపుగా జాగ్రత్తగానే సినిమాలు చేస్తున్నాడు. ఇక ఇప్పుడు వస్తున్న వార్త ఏంటీ అంటే అతను ఇక నుంచి తన సినిమాల్లో పెట్టుబడి పెట్టాలి అని మహేష్ బాబు మాదిరిగా ప్రతీ సినిమాలో తన షేర్ అనేది కొంత ఉండే విధంగా ప్లాన్ చెయ్యాలి అని భావిస్తున్నాడు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు మరి. దానికి కారణం ఏంటీ అనేది తెలియదు గాని ఇక నుంచి మాత్రం అది పక్కాగా ఫాలో అవుతాడు అని అంటున్నారు. 

 

ఆ వ్యవహారాలూ అన్నీ కూడా భార్య చూసుకునే అవకాశాలు ఉన్నాయి అని సమాచారం. మరి నిజం ఎంత అనేది ఎవరికి స్పష్టంగా తెలియదు గాని ఈ విషయంలో ఇప్పటికే అతను పుష్ప సినిమా నిర్మాతకు స్పష్టంగా చెప్పాడు అని సమాచారం. సదరు నిర్మాత కూడా ఓకే అన్నారు అని టాక్ మరి. చూడాలి...

మరింత సమాచారం తెలుసుకోండి: