భారతీయ సినీ పరిశ్రమలో దశాబ్దాలుగా ఆధిపత్యం హిందీ సినిమాలదే అయినా.. ఏడాదిలో ఎక్కువ సినిమాలు తెరకెక్కించేది మాత్రం తెలుగు సినీ పరిశ్రమే. హిట్, ఫ్లాప్ లకు అతీతంగా తెలుగులో సినిమాలు ఎక్కువగా విడుదలవుతూ ఉంటాయి. 2020లో కూడా అదే జరిగేది. కానీ.. కరోనా వచ్చి మొత్తం అల్లకల్లోలం చేసేసింది. పరిశ్రమ మొత్తాన్ని భవిష్యత్ ఏంటో.. అని అయోమయ పరిస్థితిని కల్పించేసింది. ఈనేపథ్యంలో అర్ధ సంవత్సరం గడిచిపోయింది. ఇందులో మూడు నెలలు మాత్రమే సినిమాలు విడుదలయ్యాయి. గట్టిగా 20 సినిమాలు కూడా రాలేదు.

IHG

 

అతి తక్కువగా విడుదలైన సినిమాల్లో ఓ నాన్ బాహుబలి హిట్, సూపర్ హిట్, హిట్, ఎబౌవ్ యావరేజ్ సినిమాలు ఉన్నాయి. బన్నీ అల.. వైకుంఠపురములో భారీ కలెక్షన్లతో సంక్రాంతి విన్నర్ తో పాటు నాన్ బీబీ హిట్ సాధించింది. మహేశ్ సరిలేరు.. మంచి కలెక్షన్లు రాబట్టింది. నితిన్ భీష్మ ఊహించని హిట్ కొట్టింది. కరోనా రాకపోతే మరో రెండు, మూడు కోట్లయినా వసూలు చేసే రన్ లో ఉంది. విశ్వక్ సేన్ హిట్ యావరేజ్ గ్రాసర్ గా నిలిచింది. తమ్మారెడ్డి భరద్వాజ్, సురేశ్ ప్రొడక్షన్స్ లో వచ్చిన 1978-పలాస విమర్శకుల ప్రశంసలు పొందింది. డిస్కోరాజా, జాను, ఎంతమంచివాడవురా, అశ్వథ్థామ, వరల్డ్ ఫేమస్ లవర్ నిరాశపరిచాయి.

IHG

 

మొదటి అర్ధ సంవత్సరం ఇలా గడిచిపోయినా రెండో అర్ధభాగంలో తేరుకుంటామన్న పరిశ్రమ ఆలోచనలు భారీగా గండిపడిందనే చెప్పాలి. ఇందుకు రీసెంట్ గా పెరుగుతున్న కరోనా కేసులే. ఈ నేపథ్యంలో షూటింగ్స్ కోసం పర్మిషన్లు తెచ్చుకున్నా అడుగు బయటపెట్టలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో షూటింగ్ జరిగే పరిస్థితులు కనపడటం లేదు. విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు త్వరలో విడుదలవుతాయి అనే ఆశలు ప్రస్తుతానికి లేనట్టే. ఈనేపథ్యంలో షూటింగ్స్ జరిగేదెప్పుడో, సినిమాలు విడుదలయ్యేది ఎప్పుడో.. సాధారణ పరిస్థితులు నెలకొనేదెన్నడో.

IHG'Palasa 1978'| AndhraBoxOffice.com

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: