తన క్రియేటివిటీ అంతా కేవలం కెమెరా ఫ్రేం లో.. టీజర్, ట్రైలర్ కటింగ్ లో.. కాస్ట్ అండ్ క్రూ ఎంపికలో చూపించే సంచలన దర్శకుడు ఆర్జిఈవి ఈ లాక్ డౌన్ టైం లోనే రెండు సినిమాలు రిలీజ్ చేశాడు. ఆ చేశాడు అవి మరి అద్భుత కళాకండాలు మరి అని అనుకోవచ్చు. సరే అవి ఎలా ఉన్నాయన్నది మ్యాటర్ కాదు చేశాడా లేదా అన్నది మ్యాటర్. మియా మాల్కోవాతో క్లైమాక్స్ తీసి ప్రేక్షకులతో బాబోయ్ వర్మ అనిపించిన ఆయన లేటెస్ట్ గా నగ్నం సినిమాతో మరోసారి షాక్ ఇచ్చాడు.

 

ఈ సినిమాలో నటించిన శ్రీ రాపాక అలియాస్ స్వీటీ.. తనని ఈ సినిమాకు ఎలా సెలెక్ట్ చేశారన్న విషయాన్ని రీసెంట్ గా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు. ఈ సినిమా ఆడిషన్స్ కోసం తాను చీరకట్టుకుని వెళ్లానని.. అప్పటికే అరడజను మంది ఆడియెన్స్ కోసం వచ్చారని.. అయితే తన కట్టు బొట్టు చూసి హైట్ అడిగారని.. 5.6 అని చెప్పగానే తనని సెలెక్ట్ చేశారని వెళ్లడించారు స్వీటీ.

 

కేవలం రెండు రోజులు మాత్రమే ఈ సినిమా షూటింగ్ జరిగిందని.. మొదటి రోజు మాములుగా జరిగినా రెండో రోజు ఎద, తొడల మీద కెమెరా ఫోకస్ చేశారని చెప్పారు స్వీటీ. షార్ట్ వేసుకుని దాని మీద ఇన్నర్ వేర్ వేయించి అది విప్పేసినట్టు షూట్ చేశారని షూటింగ్ టైం లో ఏమి అనిపించలేదు కాని సినిమా చూసి తానే షాక్ అయ్యానని చెప్పుకొచ్చారు శ్రీ రాపాక. ఫారిన్ అందాలకు 100 రూపాయలే కాని లోకల్ అందాలకు 200 అంటూ ఆర్జీవి బుట్టలో ఆడియెన్స్ బాగానే పడ్డారు. నగ్నం సినిమాలో నటించినందుకు ఆమెకు 2 లక్షలు మాత్రమే ఇచ్చారట. తను అంతే అడిగానని అదే ఇచ్చారని చెప్పారు శ్రీ. మొత్తానికి వర్మ సినిమాతో మరో హాట్ బ్యూటీ తెలుగు తెరకు పరిచయమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: