టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి హీరోయిన్స్ ఎలా అయితే వెళుతున్నారో అలాగే బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి స్టార్ హీరోయిన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో మంచి మార్కెట్ క్రేజ్ సంపాదించుకున్న స్టార్ హీరోయిన్స్ కి బాలీవుడ్ మీద విపరీతమైన మోజు ఉంటుంది. అందుకు కారణం హిందీ సినిమాలు సౌత్ మొత్తం భారీ స్థాయిలో రిలీజవుతాయి కాబట్టి. అయినా మన దర్శకుల టాలెంట్ హీరోల రేంజ్ అండ్ క్రేజ్ తో బాలీవుడ్ హీరోయిన్స్ కి మన సినిమాల మీద మోజు ఉంటుంది. అందుకే చాలామంది మన తెలుగు సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపిస్తుంటారు.

 

IHG

ఐశ్వర్య రాయ్..సుస్మిత సేన్ లాంటి వాళ్ళు కూడా మన తెలుగు సినిమాలలో నటించారు. ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ గా పాపులారిటీని సాధించిన ఆలియా భట్ దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఆర్.ఆర్.ఆర్ లో నటిస్తుంది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్న టాలీవుడ్ స్టార్ హీరో రాం చరణ్ సరసన సీత పాత్రలో కనిపంచబోతుంది. ఇప్పటికే టాలీవుడ్ లో ఆలియా భట్ కి మంచి క్రేజ్ వచ్చేసింది.

 

IHG

ఇక ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకమైన సంస్థ వైజయంతీ మూవీస్ లో నిర్మించబోయో 50 సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపక పదుకుణె ని అనుకుంటున్నారు. అంతేకాదు ఈ సినిమాకోసం భారీ రెమ్యూనరేషన్ ని ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోతున్న సర్కారు వారి పాట లో కూడా బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కూతురు సాయీ మంజ్రేకర్ ని తీసుకోవాలని ఆలోచిస్తున్నారట. 

 

IHG'd have to hold ...

అయితే ఇంతమంది గురించి ఆలోచిస్తున్న టాలీవుడ్ మేకర్స్ కి సోనమ్ కపూర్ ఎందుకు కనిపించడం లేదని అంటున్నారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన ఫొటోస్ ని అభిమానులతో షేర్ చేసుకుంటూ యాక్టివ్ గా ఉంటుంది. అంతేకాదు బాలీవుడ్ లో మంచి పాపులారిటీ ఉంది. సూపర్ హిట్స్ కూడా ఉన్నాయి. మరి ఎందుకు సోనమ్ మన వాళ్ళకి ఆనడం లేదో తెలీదు. ఒకవేళ మన వాళ్ళు అప్రోచ్ అయినా సోనమ్ నో అన్నదా ..అలా అని గనక ఉంటే నిజంగా తన బ్యాడ్ లక్ అని చెప్పాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: