టాలీవుడ్ ఇండస్ట్రీ లో అతి పెద్ద నిర్మాణ ప్రొడక్షన్ సంస్థ లో పేరున నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్. దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా ప్రస్తుతం నిర్మాణ సంస్థను ఆయన తనయుడు సురేష్ బాబు విజయవంతంగా రాణిస్తున్నారు. ఒక పక్క సినిమా నిర్మాణాన్ని చేస్తూనే మరో పక్క స్టూడియోను కూడా కొనసాగిస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమాలను చేస్తూ నిర్మిస్తూ కేవలం పెద్ద సినిమాలనే కాకుండా చిన్న తరహా సినిమాలను కూడా నిర్మిస్తున్నాడు. ట్రెండ్ కి తగ్గ విధంగా సినిమాలను నిర్మిస్తూ చాలా మంచి ఫలితాలనే అందుకుంటున్నారు. అయినా కానీ తాజా పరిస్థితుల బట్టి సినిమా నిర్మాణం పట్ల సురేష్ బాబు చేసిన వ్యాఖ్యలు డిస్ట్రిబ్యూటర్లకు ఒక్క సారిగా చెమటలు పట్టించినట్లు అయింది.

 

పూర్తి విషయంలోకి వెళితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సురేష్ బాబు మాట్లాడుతూ ఎంతో అనుభవం వున్నా గాని ప్రస్తుతం సినిమా రంగంలో సినిమాలు నిర్మించడం అంటే రాబోయే రోజుల్లో కష్టమే...ఉన్న పరిస్థితులు బట్టి నిర్మాతగా భవిష్యత్తులో కొనసాగుతానో లేదో అనే పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది అని షాకింగ్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు ఈ వ్యాఖ్యలు ఎందుకు అన్నారంటే ఇంటర్వ్యూ చేసే యాంకర్ ఒక్క నిర్మాతగానేనా రాబోయే రోజుల్లో సురేష్ బాబు గారిని డైరెక్టర్ గా చూసే అవకాశం ఉంటుందా అని ప్రశ్నించారు. దీంతో నిర్మాత సురేష్ బాబు ఈ విధంగా స్పందించారు…‘‘అసలీ కరోనా పరిస్థితుల్ని చూస్తుంటే మళ్లీ సినిమాలు నిర్మిస్తామో లేదో అన్న భయాలు కలుగుతున్నాయి.

 

ఇంకా దర్శకత్వం కూడానా? ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి ఎప్పుడు బయటపడతాం.. అసలిది ఎప్పటికి అదుపులోకి వస్తుంది.. అన్నది ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. కరోనా నుంచి బయటపడే వరకు సినీ పరిశ్రమతో పాటు అన్ని రంగాలకూ ఇబ్బందులు తప్పవు’’ అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు విని  డిస్ట్రిబ్యూటర్లు సినిమా థియేటర్ల యజమానుల గుండెల్లో భయాందోళన మరింతగా పెరిగింది. మొత్తంమీద చూస్తుంటే కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ మొత్తం డేంజర్ జోన్ లోకి వెళ్లి పోయినట్లే అని అంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: