సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందని అందరికీ తెలుసు. మహేష్ బాబు ఎక్సర్సైజ్ చేసే ఫోటోలు, పిల్లలతో ఆడుకునే ఫోటోలు అదేవిధంగా సమాజానికి మహేష్ బాబు చేసే అనేక కార్యక్రమాలు గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఇటీవల సోషల్ మీడియాలో అభిమానులతో లైవ్ లో చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్బంగా చాలామంది  సూపర్ స్టార్ అభిమానులు నమ్రతా శిరోద్కర్ ని అనేక ప్రశ్నలు వేయడం జరిగింది. అసలు మహేష్ బాబు తో ప్రేమలో ఎప్పుడు పడినట్లు ఆ పరిస్థితులు ఎలా కలిగినట్లు ఇలా అనేక విషయాల గురించి అభిమానులు అడిగిన ప్రశ్నలకు నమ్రత తనదైన శైలిలో చెప్పుకొచ్చింది. ఇంకా కుటుంబం గురించి మహేష్ గురించి కొత్త కొత్త విషయాలు తెలపడం జరిగింది. ఆ ప్రశ్నలు సమాధానాలు మీకోసం. 

 

 

- అసలు మహేష్ బాబు తో ప్రేమలో ఉన్నట్లు ఎప్పుడు తెలిసింది?

న్యూజిలాండ్ లో 52 రోజుల లాంగ్ షెడ్యూల్ చేశాం. ఆ షెడ్యూల్ ఆఖరి రోజున నాకు తెలిసింది నేను మహేష్ ప్రేమలో పడినట్టు.

 

- మరి మహేష్ బాబు తో పెళ్లి అన్న టైం లో మీ తల్లిదండ్రుల రియాక్షన్ ఏమిటి?

మహేష్ ను చూసిన తొలి చూపులోనే వాళ్లు ప్రేమలో పడిపోయారు. ఇంకేం చెప్పాలి.

 

- మహేష్ అందగాడు ఇతర దేశాల్లో కి అవుట్ డోర్ షూటింగులకు వెళ్తే మీకేమనిపిస్తుంది? 

మాకు ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంది. సో.. ఇన్-సెక్యూరిటీ అనే ఫీలింగ్ కు మా మధ్య చోటు లేదు.

 

- రాబోయే మహేష్ బర్తడే సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ? 

ఇది లాక్ డౌన్ టైమ్. కాబట్టి ఎలాంటి ప్లానింగ్ లేకపోవడమే బెస్ట్ ప్లానింగ్

 

- లాక్ డౌన్ లో ఓ మంచి అనుభవం

ఎప్పట్నుంచో అనుకుంటున్న మా పెరడు మొత్తం సెట్ చేశాను. నేను ఎలా ఊహించుకున్నానో ఇప్పుడది అలా తయారైంది. మొత్తం పచ్చదనం, పక్షులు.

 

- సర్కార్ వారి పాట స్టోరీ ఎలా ఉంటుంది?

ఇప్పుడే చెప్పలేను కానీ సినిమాలో ప్రతి ఎలిమెంట్ ను అంతా బాగా ఎంజాయ్ చేస్తారు

 

- మహేష్ నటించిన ఒక్కడు సినిమా గురించి

ఒక్కడు సినిమా ఓ క్లాసిక్. ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్. ఎన్నిసార్లయినా చూడొచ్చు.

 

- మహేష్-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో సినిమా ఎప్పుడు ఉంటుంది?

అది కాలమే నిర్ణయిస్తుంది

 

- మహేష్ సినిమాల్లో చొరవ తీసుకుంటారా?

నా ప్రమేయం అస్సలు ఉండదు.

 

- మీ పిల్లలు సితార-గౌతమ్ తెలుగు మాట్లాడతారా?

వాళ్లు తెలుగు, ఇంగ్లిష్, మరాఠీ చక్కగా మాట్లాడతారు.

 

- లాక్ డౌన్ కు ముందు సందర్శించిన ప్రదేశాలు

న్యూయార్క్, దుబాయ్

 

- ఆనందంగా, ఫిట్ గా ఉండడానికి ఏం చేస్తారు

కడుపునిండా తింటాను. బాగా ఎక్సర్ సైజ్ చేస్తాను. తొందరగా నిద్రపోతాను

 

- మీ ఫేవరెట్ జ్యూవెలరీ

నా తాళి. 

మరింత సమాచారం తెలుసుకోండి: