చిరంజీవి ‘సైరా’ మూవీ అనుష్క ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి గురించి తన అనుచరులకు చాల గొప్పగా చెపుతున్న సన్నివేశంతో మొదలవుతుంది. ఈ ప్రత్యేక పాత్రలో అనుష్క చేత నటింప చేయడానికి రామ్ చరణ్ చాల కష్టపడ్డాడు అన్నవార్తలు అప్పట్లో వచ్చాయి. ఇప్పుడు అదే ప్రయోగం మళ్ళీ పవన్ కళ్యాణ్ క్రిష్ ల మూవీ విషయంలో రిపీట్ కాబోతోందా అన్నలీకులు వస్తున్నాయి.


అయితే ఈసారి చరణ్ తన బాబాయ్ పవన్ కళ్యాణ్ కోసం అనుష్క బాధ్యతను తీసుకుంటున్నాడు. తెలుస్తున్న సమాచారంమేరకు క్రిష్ పవన్ తో తీస్తున్న ‘విరూపాక్ష’ మూవీ రామ్ చరణ్ పాత్రతో ప్రారంభం అవుతుందని టాక్. చరణ్ తన స్నేహితులకు అలనాటి విరూపాక్షుడి కథను చెపుతూ ప్రేక్షకులను ఈసినిమాకు సంబంధించిన ఆకాలంలోకి తీసుకువెళతాడని తెలుస్తోంది.


వాస్తవానికి మొదట్లో ఈ సినిమాలో ఇలాంటి ప్రయోగం చేయాలి అన్న ఆలోచనలు లేకపోయినా ఇప్పుడు ఈ మూవీ ప్రాజెక్ట్ కు ప్రస్తుత పరిస్థితులలో మరింత క్రేజ్ తీసుకు రావాలి అంటే ఇలాంటి ప్రయోగం అవసరం అన్న అభిప్రాయంతో క్రిష్ చరణ్ ను కలిసి ఈ పాత్రను చేయడానికి ఒప్పించాడు అని అంటున్నారు. వాస్తవానికి పవన్ కెరియర్ లో భారీ బడ్జెట్ తో తీయబడుతున్న ఈ మూవీ మార్కెట్ కు చరణ్ అతిథి పాత్ర కూడ ఎంతోకొంత సహకరిస్తుందని క్రిష్ ఈ ప్లాన్ వేసినట్లు సమాచారం.


ప్రస్తుతం పవన్ కరోనా సమస్యల వల్ల సినిమాల షూటింగ్ లకు దూరంగా ఉండటంతో ఈ పరిస్థితులు అన్నీ కుదుటపడ్డాక మాత్రమే ముందుగా ‘వకీల్ సాబ్’ ను పూర్తి చేసి ఆతరువాత క్రిష్ సినిమా వైపు వచ్చే ఆస్కారం ఉంది. అయితే చరణ్ ఇప్పటికే ఒప్పుకున్న ‘ఆచార్య’ లోని ప్రత్యేక పాత్ర షూటింగ్ కు ఎప్పుడు వస్తాడో తెలియని పరిస్థితులలో క్రిష్ సినిమా కోసం చరణ్ ఎప్పుడు తన డేట్స్ ఇస్తాడు అన్నది క్రిష్ కు కూడ సమాధానం దొరకని ప్రశ్న..  

మరింత సమాచారం తెలుసుకోండి: