విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ వెబ్ సిరీస్ లో నటించనున్నాడని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఓటీటీలకి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ ఇటువైపుగా చూస్తున్నారు. ఆ క్రమంలో స్టార్ హీరోలు సైతం వెబ్ సిరీస్ లలో నటించడానికి ముందుకు వస్తున్నారు. కరోనా కారణంగా థియేటర్లు మూతబడిపోవడంతో జనాలు వినోదం కోసం ఓటీటీపై పడ్డారు. కొన్ని రోజుల తర్వాత ఓటీటీ అనేది థియేటర్ కి ప్రత్యామ్నాయంగా మారుతుందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

 

అయితే థియేటర్ లో వచ్చే ఎక్స్ పీరియన్స్ ఓటీటీ ద్వారా రాదని, అందువల్ల థియేటర్ బిజినెస్ కి ఎలాంటి ప్రాబ్లెమ్ ఉండదని కూడా అంటున్నారు. ఏదేమైతేనేం ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తోంది. ఇప్పటికే ఉన్నవాటితో పోటీ పడడానికి ఇంకా చాలా ఫ్లాట్ ఫామ్ లు మార్కెట్ లోకి రానున్నాయి. అయితే భవిష్యత్తులో ఓటీటీకి డిమాండ్ పెరగనున్న నేపథ్యంలో సినిమా వారు అక్కడ కూడా పాగా వేయాలని చూస్తున్నారు.

IHG'Sarileru Neekevvaru' With Superstar  - <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=ANIL MUSIC' target='_blank' title='anil -గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>anil </a>Sunkara - TimesSouth.com

 

అందులో భాగంగా ప్రకాష్ రాజ్ వెబ్ సిరీస్ లో నటించడానికి రెడీ అయ్యాడు. అయితే ఈ వెబ్ సిరీస్ కి స్క్రిప్టుని ప్రకాష్ రాజే రాస్తున్నాడట. సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న నిర్మాత అనిల్ సుంకర్ ఈ వెబ్ సిరీస్ నిర్మాతగా పనిచేయనున్నాడట. ఇటీవల మధుబాబు షాడో సిరీస్ ని వెబ్ సిరీస్ గా రూపొందిస్తున్నానని ప్రకటించిన అనిల్ సుంకర ప్రకాష్ రాజ్ తో సిరీస్ ప్లాన్ చేస్తున్నాడు.

 

 

మరి వీరిద్దరి కాంబినేషనలో వస్తున్న ఈ వెబ్ సిరీస్ ఏ ఓటీటీ ఛానెల్ లో ప్రసారం కానుందో చూడాలి. సినిమాల్లో సక్సెస్ అందుకున్న వీరిద్దరూ ఓటీటీలో అదే సత్తా చాటుతారేమో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: