లేడీ సూపర్ స్టార్ విజయశాంతి భారతీయ సినిమా పరిశ్రమలోనే అత్యంత పాపులారిటీ సంపాదించిన ఏకైక నటీమణి అని చెప్పుకోవచ్చు. 1980-90లలో విజయశాంతి విపరీతంగా అందాలను ఆరబోసి అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. ఆమె 80-90 కాలంలోనే బికినీ ధరించి తెలుగు ప్రేక్షకుల మతిపోగొట్టేసింది. భానుమతిగారి మొగుడు,  చాలెంజ్, ముద్దుల మామయ్య, మహానగరంలో మాయగాడు సంఘర్షణ వంటి చిత్రాల్లో తన అందచందాలను బీభత్సంగా ఆరబోసి తెలుగు ప్రేక్షకులకు చెమటలు పట్టించింది. ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా దర్శకులు చెప్పిన దానికంటే ఎక్కువగా ఆమె అందాలను ఆరబోసేది.


 అందుకే తన చిత్రాలు ఎన్ని ప్లాప్ అయినప్పటికీ అవకాశాలు మాత్రం కోకొల్లలుగా వచ్చేవి. కేవలం శృంగార భరితమైన హీరోయిన్ గా పేరొందిన విజయశాంతి... టి. కృష్ణ దర్శకత్వంలో నేటి భారతం సినిమాలో నటించి అందర్నీ ఆశ్చర్య పరిచింది. కేవలం గ్లామర్ రోల్స్ లో నటించిన విజయశాంతి ఒకేసారి పవర్ ఫుల్ క్యారెక్టర్ లో అద్భుతంగా నటించగానే యావత్ తెలుగు రాష్ట్రం ఆమెకు నీరాజనాలు పలికారు. సినీ విమర్శకులు సైతం ఆమెకు అభిమానులు అయ్యారంటే అతిశయోక్తి కాదు. మెకానిక్ కి విజయశాంతి డాన్స్ తప్ప నటన ఎవరి దగ్గర నేర్చుకోలేదు. యాక్టింగ్ నేర్చుకో కుండానే సినిమాల్లో అరంగేట్రం చేసి ఒక ఊపుఊపిన ఏకైక హీరోయిన్ విజయశాంతి అని చెప్పుకోవచ్చు పదమూడేళ్ల వయసులోనే తెరంగేట్రం చేసిన విజయశాంతి 30 ఏళ్ల తన సినీ జీవితంలో 60మంది బడా హీరోలతో 175 పైగా సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచి పోయింది.


మెగాస్టార్ తో కలిసి శృంగార భరితమైన సినిమాలో నటించి... వెనువెంటనే పూర్తి కుటుంబ భరితమైన పడమటిసంధ్యారాగం వంటి హిట్ సినిమాల్లో నటించింది. స్వయంకృషి, మొండి మొగుడు పెంకి పెళ్ళాం వంటి చిత్రాల్లో ఆమె నటనకు సినీ ప్రేక్షకులంతా ఫిదా అయిపోయారు. ఎన్టీఆర్ ఏఎన్నార్ లకు కూడా ఆయన సోదరి మణి గా నటించింది. కృష్ణ శోభన్ బాబు కృష్ణంరాజు వంటి హీరోల సరసన నటించే తన నటనా చాతుర్యాన్ని చాటుతున్నాయి.


నేటి భారతం కర్తవ్యం ప్రతిఘటన వంటి వివాదాస్పద సినిమాల్లో అత్యద్భుతంగా నటించి ఆ సినిమాను సూపర్ హిట్స్ గా నిలిచేలా చేసింది. కిరణ్ బేడి నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిన కర్తవ్యం సినిమా లో పోలీస్ స్టేషన్ చేసిన విజయశాంతి దుమ్ము రేపింది అని చెప్పుకోవచ్చు. అయితే ఏమైనా విజయశాంతి ఒక్క అందంతో మాత్రమే కాదు తన నటనా చాతుర్యంతో కూడా తెలుగు ప్రేక్షకుల మనసులను చూరగొన్నది.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: